మెగాఫోన్ పడుతున్న సూపర్‌స్టార్!

మెగాఫోన్ పడుతున్న సూపర్‌స్టార్!
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ దర్శకుడిగా మారబోతున్నారు. నాలుగు దశాబ్దాల నట ప్రస్థానంలో తనదైన మార్కు నటనతో ఆకట్టుకుంటూ మలయాళ చిత్ర సీమలో సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు మోహన్‌లాల్. ప్రస్తుతం ఆయన నటించిన ‘లూసీఫర్’ మలయాళంలో రూ. వంద కోట్లు రాబట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదిలా వుంటే మోహన్‌లాల్ తొలిసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు.
‘లూసీఫర్’ చిత్రంతో హీరో పృథ్వీరాజ్ దర్శకుడిగా మారడంతో మోహన్‌లాల్‌కు కూడా దర్శకుడిని కావాలనే కోరిక పుట్టిందట. దీంతో తొలిసారిగా ఆయన ఓ 3డీ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అయిపోతున్నారు. ‘బార్రోజ్’ అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 400 ఏళ్ల నాటి వాస్కోడగామకు చెందిన ట్రెజరీకి గార్డ్‌గా వుండే ఓ యువకుడి కథగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.
మలయాళంతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయాలని మోహన్‌లాల్ భావిస్తున్నారట. కాగా ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన పలువురు పాపులర్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది.
మెగాఫోన్ పడుతున్న సూపర్‌స్టార్! | actioncutok.com
You may also like: