‘సైరా’ విడుదల: చిరంజీవి పుట్టినరోజుకా? దసరాకా?


'సైరా' విడుదల: చిరంజీవి పుట్టినరోజుకా? దసరాకా?

‘సైరా’ విడుదల: చిరంజీవి పుట్టినరోజుకా? దసరాకా?

భారత తొలి స్వాతంత్ర్య సమరయోధునిగా చరిత్ర చెబ్తోన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. విజయదశమికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాత రాంచరణ్ సకల సన్నాహాలూ చేస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతి, రవికిషన్ వంటి పేరుపొందిన తారలు నటిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. త్వరలో చైనాలో కొన్ని సన్నివేశాలు తీసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే వాటిని పూర్తి చేయనున్నారు.

మొదట చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22న చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నా, అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా సెలవుల్లో రిలీజ్ చేస్తే వసూళ్ల పరంగా మరింత ప్రయోజనం ఉంటుందని మెగా కంపెనీ భావిస్తోంది. అయితే చివరి నిమిషంలో ఏ నిర్ణయమైనా తీసుకొనే అవకాశం ఉంది.

ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలతో సినిమా అద్భుతంగా వస్తోందని చిరంజీవి అమితానందంగా ఉన్నారని సినిమా యూనిట్ చెబ్తోన్న మాట. దర్శకుడు సురేందర్‌రెడ్డి కెరీర్‌లో ఈ సినిమా కలికితురాయిలా మిగిలిపోతుందని వాళ్లంటున్నారు.

‘సైరా’ విడుదల: చిరంజీవి పుట్టినరోజుకా? దసరాకా? | actioncutok.com

You may also like: