రానా సినిమాకు ట‌బు గ్రీన్‌ సిగ్న‌ల్‌!


రానా సినిమాకు ట‌బు గ్రీన్‌ సిగ్న‌ల్‌!
Tabu

రానా సినిమాకు ట‌బు గ్రీన్‌ సిగ్న‌ల్‌!

ట‌బు తెలుగులో సినిమా చేసి చాలా కాల‌మే అవుతోంది. బాల‌కృష్ణ‌, కె. రాఘ‌వేంద్రరావు క‌ల‌యిక‌లో దాదాపు 11 ఏళ్ల క్రితం వ‌చ్చిన చిత్రం ‘పాండురంగ‌డు’. ఇందులో వేశ్య పాత్ర‌లో న‌టించిన ట‌బు, దాని తర్వాత మ‌రో తెలుగు చిత్రంలో క‌నిపించ‌లేదు.

సుదీర్ఘ విరామం అనంత‌రం మ‌ళ్లీ తెలుగు చిత్రాల్లో న‌టించ‌డానికి సిద్ధ‌మౌతోంది. ఇటీవ‌ల త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌బోతున్న చిత్రంలో బన్నీ తల్లిగా కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి ట‌బు అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రాబోతోంది.

ఇదిలా వుండ‌గా ఆమె మ‌రో తెలుగు డైరెక్ట‌ర్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి పేరుతెచ్చుకున్న వేణు ఊడుగుల త్వ‌ర‌లో ఓ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. రానా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా, సాయి ప‌ల్ల‌వి న‌క్స‌లైట్‌గా న‌టించ‌నున్నారు.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు నిర్మించ‌నున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం ముందు విజ‌య‌శాంతిని అనుకున్న వేణు ఊడుగుల ఆమె అంగీకారం తెల‌ప‌క‌పోవ‌డంతో ఆ పాత్ర కోసం ట‌బుని సంప్ర‌దించార‌ని, పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఆమె వేణు ఊడుగుల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిందనీ తెలిసింది. కాగా ఉత్త‌ర తెలంగాణ‌లోని లైవ్ లొకేష‌న్‌ల‌లో షూటింగ్ జరపనున్న జ‌ర‌ప‌నున్న ఈ చిత్రాన్ని ప్ర‌స్తుతం ఎండ‌లు వుండ‌టంతో జూలైలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

రానా సినిమాకు ట‌బు గ్రీన్‌ సిగ్న‌ల్‌! | actioncutok.com

You may also like: