అందులో నిత్యా.. ఇందులో హ‌న్సిక‌!


అందులో నిత్యా.. ఇందులో హ‌న్సిక‌!
Hnasika Motawani

అందులో నిత్యా.. ఇందులో హ‌న్సిక‌!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ రూపొందించిన చిత్రం ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’. ఇందులో స‌మంత క‌థానాయిక‌గా న‌టించినా, ఆమెనీ, అల్లు అర్జున్‌ని ఆడుకునే పాత్రలో ఉపేంద్ర చెల్లెలుగా నిత్యామీన‌న్ న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి పాత్ర‌నే హ‌న్సిక చేయ‌బోతోంది.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా బుధ‌వారం మొద‌లైంది. గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. త్రివిక్ర‌మ్ మార్కు ఫ్యామిలీ ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో హ‌న్సిక నెగెటివ్ ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిసింది.

ప్రస్తుతం జి. నాగేశ్వ‌ర‌రెడ్డి చిత్రంలో న‌టిస్తున్న హ‌న్సిక హ‌వా ఈ మ‌ధ్య త‌మిళంలో కాస్త త‌గ్గింది. దీంతో మ‌ళ్లీ త‌న హ‌వాని కొన‌సాగించాల‌న్నా, పూర్వ‌ వైభ‌వాన్ని సొంతం చేసుకోవాల‌న్నా త‌న‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ హిట్ కావాలి. ఆ కార‌ణంగానే పాత్ర నెగెటివ్‌దే అయినా పేరు మాత్రం రావ‌డం గ్యారంటీ అనే న‌మ్మ‌కంతో ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఇచ్చిన ఆఫ‌ర్‌కు హన్సిక గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిన‌ట్లు తెలిసింది.

అందులో నిత్యా.. ఇందులో హ‌న్సిక‌! | actioncutok.com

You may also like: