‘వి’లో నాని పేరు దాచేశారు!


'వి'లో నాని పేరు దాచేశారు!

‘వి’లో నాని పేరు దాచేశారు!

నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌తో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ నిర్మించనున్న చిత్రానికి ‘వి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితిరావ్ హైదరి నాయికలుగా నటిస్తున్నారు.

అయితే సోమవారం ఉదయం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తారాగణం జాబితాలో నాని పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. నాని పేరు మినహా మిగతా ముగ్గురి పేర్లనూ క్యాస్టింగ్ లిస్ట్‌లో ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగానే నాని పేరు సస్పెన్స్‌లో పెట్టడానికి అలా చేశారా? లేక నాని పేరు లేకపోవడానికి ఇంకే కారణమేమైనా ఉందా?.. అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది.

ఈ సినిమా చేస్తున్నట్లు ‘జెర్సీ’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని చెప్పాడు. అలాంటప్పుడు క్యాస్టింగ్‌లో అతడి పేరు దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో దర్శక నిర్మాతలకే తెలియాలి.

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ 36వ సినిమాకి పేరుపొందిన హిందీ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నాడు. ‘సైరా.. నరసింహారెడ్డి’ తర్వాత అతడు సంగీతం అందిస్తున్న తెలుగు సినిమా ఇదే.

ఇంద్రగంటి ఆస్థాన ఛాయాగ్రాహకుడు పి.జి. విందా ఈ సినిమాకీ పనిచేస్తుండగా రవివర్మ యాక్షన్ డైరెక్టర్‌గా, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

'వి'లో నాని పేరు దాచేశారు!

‘వి’లో నాని పేరు దాచేశారు! | actioncutok.com

Trending now: