కోర్టు మెట్లెక్కిన ‘2 స్టేట్స్’


కోర్టు మెట్లెక్కిన '2 స్టేట్స్'

కోర్టు మెట్లెక్కిన ‘2 స్టేట్స్’

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్‌లో రూపొందిస్తున్న చిత్రం ‘2 స్టేట్స్‌’. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల ‘2 స్టేట్స్‌’ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడివి శేష్, శివానీ రాజ‌శేఖ‌ర్ జంటగా న‌టిస్తున్నారు. వెంక‌ట్ రెడ్డి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మాత‌.

దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత దర్శకుడు నిర్మాతలకి మధ్య స్టోరీ మార్పుల విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. నిర్మాత చెప్పిన మార్పులు కథకు ఏమాత్రం న్యాయం చేయలేవని దర్శకుడు చెప్పినా ఆయన వినకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది.

ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి డైరెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ…

“నేను ముందుగా ముంబై లోని బాలాజీ టెలి ఫిలిమ్స్ లో డైరెక్షన్ కోర్స్ పూర్తి చేసుకుని, స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు పనిచేశాను. ఇప్పుడు నేను దర్శకుడిగా పరిచయం అవుతూ తీస్తున్న చిత్రం “2స్టేట్స్”. ఈ చిత్రం మొదలవుతున్నప్పుడు హీరో హీరోయిన్లు, నిర్మాతకు నేను నా స్టోరీని పూర్తిగా వినిపించి అందరి అనుమతి అయిన తరువాత షూటింగ్ మొదలుపెట్టాను.

ఇప్పటికి మూవీ 70% పుర్తి చేసుకుంది. మా ఆర్టిస్టులు, నిర్మాత మిగతా టెక్నిషన్స్ అందరూ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ ఔట్ ఫుట్ విషయం లో చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నిర్మాత కొన్నిరోజుల క్రితం మీడియాతో షేర్ చేసుకున్నారు కూడా. సినిమా బాగా వస్తున్న టైంలో  నా కథను కొంతమంది ప్రోద్బలంతో పక్కదోవ పట్టించే దిశగా కథలో మార్పులు చేయమని నిర్మాత అడిగారు. దానికి నేను తిరస్కరించాను.

అయితే కొంతమందితో కలిసి  నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ నన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాలని  న్యూస్ పేపర్స్ లో,  సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేయించారు. నన్ను ‘2 స్టేట్స్’ మూవీ దర్శకుడిగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి నేను నిర్మాత పై కోర్ట్ లో కేసు వేశాను. సివిల్ కోర్టులో ఉన్న వేకేషన్ కోర్ట్ విచారణ అనంతరం ఈ నెల 30న ప్రొడ్యూసర్ ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) ని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

‘2స్టేట్స్’  సినిమాకు నేను దర్శకత్వంతో పాటు భాగస్వామిగా కూడా ఉన్నాను. ప్రాఫిట్ హోల్డర్ కూడా. ఈ చిత్ర హక్కులు, రిమేక్ రైట్స్ ముంబాయ్ లో చేసిన అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా పూర్తిగా  దర్శకత్వం వహించే హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి.

నేను కాకుండా మిగతా 30% షూటింగ్ పూర్తి చేయాలని ఏ దర్శకుడైనా ప్రయత్నిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. అంతేకాదు ‘2 స్టేట్స్’ మూవీ కథలో మార్పులు చేసి నన్ను ప్రాజెక్ట్ నుండి దూరం చేయాలనుకున్న అందరి పేర్లు, మరికొన్ని విషయాలు కోర్టు అనుమతితో త్వరలో బయట పెడతాను” అని వివరించారు.

కోర్టు మెట్లెక్కిన ‘2 స్టేట్స్’ | actioncutok.com

More for you: