కళ్లముందే.. మంటల్లో 20 మంది దుర్మరణం


కళ్లముందే.. మంటల్లో 20 మంది దుర్మరణం

కళ్లముందే.. మంటల్లో 20 మంది దుర్మరణం

సూరత్ : గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని సర్తానా ప్రాంతంలో శుక్రవారం సంభవించిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది దుర్మరణం చెందారు. ఒక కోచింగ్ సెంటర్ భవనం రెండో అంతస్తులో అకస్మాత్తు గా చెలరేగిన మంటలు క్షణాల్లో తీవ్ర రూపం దాల్చాయి. రోడ్లపై జనం చూస్తుండగానే ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు విద్యార్థులు భవనం పై నుంచి దూకేశారు.

18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపుచేయగలిగారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని సూరత్ నగర పోలీస్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్ లో స్పందిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

ఈ ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్ రూపాని విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. సూరత్ పోలీసులు ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కళ్లముందే.. మంటల్లో 20 మంది దుర్మరణం | actioncutok.com

More for you: