2019: బ్రదర్స్ స్పెషల్!


2019: బ్రదర్స్ స్పెషల్!
Vijay and Anand

2019: బ్రదర్స్ స్పెషల్!

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న క‌థానాయ‌కులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయితేజ్‌, క‌థానాయిక‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ కి.. 2019 ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో వీరి సోద‌రులు తెలుగు తెర‌పై తొలిసారిగా క‌థానాయ‌కులుగా అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు.

వీరిలో ముందుగా విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా entry  ఇవ్వ‌నున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు కేవీఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘దొర‌సాని’ ద్వారా ఆనంద్ క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు. అంతేకాదు.. ఇదే చిత్రంతో రాజ‌శేఖ‌ర్‌, జీవిత గారాల ప‌ట్టి శివాత్మిక నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది. జూలై 5న ‘దొర‌సాని’ తెర‌పైకి రానుంద‌ని స‌మాచారం.

2019: బ్రదర్స్ స్పెషల్!
Vaishnav and Sai

అలాగే సాయితేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్‌… మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ‘ఉప్పెన‌’ ద్వారా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. డెబ్యూ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ సినిమాతో కృతి శెట్టి తెలుగు తెర‌కు నాయిక‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది. త‌మిళ‌న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఇందులో villain గా న‌టిస్తున్నాడు. ఇదివ‌ర‌కు ‘శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌’లో  బాల‌న‌టుడిగా అల‌రించిన వైష్ణ‌వ్‌.. ఈ చిత్రంతో హీరోగానూ మెప్పిస్తాడేమో చూడాలి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

2019: బ్రదర్స్ స్పెషల్!
Aman and Rakul

ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మ్ముడు అమ‌న్ ప్రీత్ సింగ్ కూడా ఇదే ఏడాది హీరోగా entry ఇస్తున్నాడు. లారెన్స్ దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ద్వారా మోనికా శ‌ర్మ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తొలి అడుగులు వేస్తోంది. ఈ సంవ‌త్స‌రాంతంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

మ‌రి.. విజ‌య్‌, ర‌కుల్‌, సాయితేజ్ సోద‌రుల‌లో ఎవ‌రు successful గా కెరీర్‌ని ముందుకు సాగిస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

2019: బ్రదర్స్ స్పెషల్! | actioncutok.com

More for you: