మ‌హేశ్ కోసం క్యూలో ఆరుగురు!


మ‌హేశ్ కోసం క్యూలో ఆరుగురు!

మ‌హేశ్ కోసం క్యూలో ఆరుగురు!

మ‌హేశ్ బాబు.. ద‌ర్శ‌కుల క‌థానాయ‌కుడు. అందుకే.. డైరెక్ట‌ర్ చెప్పిన‌దాన్ని బ్లైండ్‌గా ఫాలో అయిపోయి యాక్ట్ చేసేస్తాడు. అలా.. ఫాలో అవ‌డం కొన్ని సార్లు దెబ్బ కొట్టినా.. చాలా సార్లు లాభించింద‌నే చెప్పాలి.  ద‌ర్శ‌కులకు మ‌హేశ్ ఎంతో విలువ ఇస్తాడు క‌నుకే ప‌లువురు ద‌ర్శ‌కులు త‌న‌తో ప‌నిచేయాల‌ని ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే.. మ‌హేశ్ 27  కోసం ఆరుగురు ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌హ‌ర్షి త‌రువాత అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో మ‌హేశ్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌థానాయ‌కుడిగా మ‌హేశ్‌కిది 26వ చిత్రం.  త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమా.. 2020 సంక్రాంతికి రిలీజ‌వుతుంది. ఆ త‌రువాత‌.. మ‌హేశ్ ఎవ‌రితో సినిమా చేయ‌బోతున్నాడ‌నేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఉంది. 

‘గీత గోవిందం’ ఫేమ్ ప‌ర‌శురామ్‌కి ఆ అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు.. కాదు కాదు ‘మ‌హ‌ర్షి’ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లితో ఉండొచ్చ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. అలాగే ఇప్ప‌టికే మ‌హేశ్‌తో సినిమాలు చేసిన సుకుమార్‌, త్రివిక్ర‌మ్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నార‌ని వినిపిస్తోంది. అంతేకాదు.. సెన్సేష‌న‌ల్ డెబ్యూ డైరెక్ట‌ర్స్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ‌, అజ‌య్ భూప‌తి కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నార‌ని టాక్‌.

More for you: