’96’ రీమేక్‌.. అప్పుడే సగం పూర్తి


'96' రీమేక్‌.. అప్పుడే సగం పూర్తి

’96’ రీమేక్‌.. అప్పుడే సగం పూర్తి

త‌మిళ‌నాట క్లాసిక్‌గా నిల‌చిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ’96’. విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో నూత‌న ద‌ర్శ‌కుడు సి. ప్రేమ్ కుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమా.. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 4న విడుద‌లై భారీ విజ‌యం సాధించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో  రీమేక్ చేస్తున్నాడు స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజు.

విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో శ‌ర్వానంద్‌, త్రిష పాత్ర‌లో స‌మంత న‌టిస్తున్న ఈ రీమేక్‌ని కూడా ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ ప్రేమ్ కుమార్ రూపొందిస్తుండ‌డంతో.. ఆరంభం నుంచే ఈ చిత్రంపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టుగా కొన్ని మార్పుచేర్పుల‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

అంతేకాదు.. ఉగాది సంద‌ర్భంగా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంద‌ని తెలిసింది. మిగిలిన చిత్రాన్ని వైజాగ్‌, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పిక్చ‌రైజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. శ‌ర్వా, స‌మంత‌పై వ‌చ్చే కాంబినేష‌న్ సీన్ల‌న్నీ ఈ షెడ్యూల్స్‌లోనే పూర్తి చేస్తార‌ని స‌మాచారం.

అలాగే జూలై నెలాఖ‌రు నాటికి సినిమాని పూర్తి చేసి.. సెప్టెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మ‌రి.. త‌మిళ వెర్ష‌న్ లాగే తెలుగు వెర్ష‌న్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తుందా?  లెట్స్ వెయిట్‌.

’96’ రీమేక్‌.. అప్పుడే సగం పూర్తి | actioncutok.com

More articles for you: