అమల రాసిన ప్రేమలేఖ!


అమల రాసిన ప్రేమలేఖ!

అమల రాసిన ప్రేమలేఖ!

నా హీరో, నా భర్తా, నా స్నేహితుడా.. నువ్వు నీ నేలమీద నిల్చున్నావ్.

నటుడివి కావడానికి, తారలనందుకోవడానికి ఉత్కృష్టంగా పైకెగిరావ్.

నువ్వు తెరపై కనిపించగానే ఇప్పటికీ నా చూపులు తిప్పుకోలేను.

నీ నవ్వు, నీ కళ్లలోని మెరుపు, నీ నడక, నీ స్టైల్.. చూశానంటే ఇప్పటికీ నా గుండె జారుతుంటుంది.

ఏళ్లు గడుస్తున్న కొద్దీ నువ్వెంత సెక్సీగా తయారవుతున్నావో చెప్పలేను!

నువ్వు ఆటను ఎప్పటికీ ఆపవు. మాకు నేర్పుతుంటావు.

ప్రతి సవాలునీ ధైర్యంగా ఎదుర్కోవడానికి నువ్వే ఒక ఉదాహరణంగా మా ముందు నిలుస్తావు.

ఈ సారి ఏం చేస్తావోనని నీ ప్రతి సినిమా విడుదల కోసం ఆసక్తిగా వేచి చూస్తుంటాను.

మిస్టరీ? రొమాన్స్? యాక్షన్‌తో నిండిన కామెడీ? లేదా ఏదైనా భక్తి సినిమా?

నువ్వు నాకు వెంకటేశ్వరస్వామినీ, రాముడినీ, షిర్డీ సాయిబాబానీ పరిచయం చేశావ్.

ఇప్పుడు వాళ్లంతా మన కుటుంబంలో భాగం.

కనెక్టయ్యే కథల్ని మాకు అందించావ్.

మేం ఆశించినట్లు హద్దుల్ని దాటే ఆశల్ని తీసుకొచ్చావ్.

నువ్వు నా మ్యాజిక్‌వి. నీలోనే ఆ మ్యాజిక్ ఉంది.

మ్యాజిక్‌ని క్రియేట్ చేసిన 33 ఏళ్ల, 95 సినిమాల నీ నట ప్రస్థానానికి అభినందనలు మై స్వీట్‌హార్ట్.

క్లింట్ ఈస్ట్‌వుడ్‌లా, అమితాబ్ బచ్చన్‌లా, అక్కినేని నాగేశ్వరరావులా సినిమాలో మరిన్ని దశాబ్దాలు ప్రకాశవంతంగా నటుడిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.

బంగారు ఆకాశం కింద నీ దౌడు

ఇదింకా సగమే – నా హీరో, నా ఫ్రెండ్.

ప్రేమతో – నీ అభిమాని, అమల.

అమల రాసిన ప్రేమలేఖ!

అమల రాసిన ప్రేమలేఖ! | actioncutok.com

More for you: