అక్క‌డ కంగన.. ఇక్కడ విజ‌య్‌!


అక్క‌డ కంగన.. ఇక్కడ విజ‌య్‌!

అక్క‌డ కంగన.. ఇక్కడ విజ‌య్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. టాలీవుడ్ న‌యా సెన్సేష‌న్‌.  ఏడాదికేడాదికి త‌న స్థాయిని పెంచుకుంటున్న యువ క‌థానాయ‌కుడు.

కంగ‌నా ర‌నౌత్‌.. బాలీవుడ్ ఫ‌రెవ‌ర్ సెన్సేష‌న్‌. గ‌త ఐదేళ్ళుగా హిందీనాట  హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌లా నిలుస్తూ ‘క్వీన్‌’లా దూసుకుపోతున్న నాయిక‌.

అలాంటి ఈ ఇద్ద‌రూ.. ఒకే రోజున త‌మ కొత్త చిత్రాల‌తో సంద‌డి చేయ‌బోతున్నారు. ఆ తేది జూలై 26 కాగా.. ఆ చిత్రాలు ‘డియ‌ర్ కామ్రేడ్‌’, ‘మెంట‌ల్ హై క్యా?’. ఈ రెండు సినిమాల‌కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌ముంది. అదేమిటంటే.. అటు కంగ‌నా, ఇటు విజ‌య్ ఇద్ద‌రూ కూడా త‌మ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌గా నిల‌చిన చిత్రాల్లో పెయిర్స్‌గా న‌టించిన వారితోనే ఈ కొత్త చిత్రాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

‘డియ‌ర్ కామ్రేడ్‌’ విష‌యానికి వ‌స్తే.. ‘గీత గోవిందం’ వంటి సెన్సేష‌న‌ల్ హిట్‌ త‌రువాత ర‌ష్మిక‌తో విజ‌య్ న‌టించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ‘మెంట‌ల్ హై క్యా?’ సంగ‌తి తీసుకుంటే.. ‘క్వీన్‌’ వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత కంగ‌నా, రాజ్‌కుమార్ రావ్ క‌ల‌సి న‌టించిన సినిమా ఇది.

మ‌రి.. క‌లిసొచ్చిన జంట‌ల‌తో ఒకే రోజున వ‌స్తున్న విజ‌య్‌, కంగ‌నా ఈ సారి ఎలాంటి ఫ‌లితాల‌ను పొందుతారో చూడాలి.

అక్క‌డ కంగన.. ఇక్కడ విజ‌య్‌! | actioncutok.com

More for you: