ఇక్కడ ‘మేజర్’.. అక్కడ ‘షేర్‌షా’!


ఇక్కడ 'మేజర్'.. అక్కడ 'షేర్‌షా'!

ఇక్కడ ‘మేజర్’.. అక్కడ ‘షేర్‌షా’!

టెర్రరిస్టుల నుంచి పౌరుల ప్రాణాలు కాపాడ్డానికి తన ప్రాణాలు త్యాగం చేసిన వీర సైనికుడు ఒకరైతే, దేశ రక్షణ కోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా సమర్పించిన వీర జవాను ఇంకొకరు. ఒకరి పేరు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అయితే, ఇంకొకరి పేరు కెప్టెన్ విక్రం బాత్రా.

ఆ ఇద్దరి శౌర్య పరాక్రమాలను తెరపై తిలకించే అవకాశం సినీ ప్రియులకు లభించనున్నది. సందీప్ ఉన్నికృష్ణన్ కేరెక్టర్‌ను తెలుగులో అడివి శేష్ పోషించనుండగా, విక్రం బాత్రా పాత్రను హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా చేస్తున్నాడు.

2008 నవంబర్ 26న ముంబైలోని ప్రఖ్యాత తాజ్‌మహల్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడి చేసి అక్కడ బసచేసిన వాళ్లపై నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడగా, తన బృందంతో కలిసి ఉన్నికృష్ణన్ 14 మంది అతిథుల్ని కాపాడారు. ఈ క్రమంలో తాను ఉగ్రవాదుల కాల్పులకు గురై గాయపడుతున్నా లెక్కచెయ్యక తన విధిని నిర్వర్తించారు. గాయాలు తీవ్రమైనవి కావడంతో ఒక రోజు తర్వాత ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేసిన విక్రం బాత్రా 1999లో పాక్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో ముందుండి వీరోచితంగా పోరాడి పాక్ సైన్యాన్ని తరిమికొట్టడంలో ప్రముఖ పాత్ర వహించారు. ప్రత్యర్థుల తూటాలకు బలయ్యారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం పరమ వీరచక్రతో గౌరవించింది.

ఉన్నికృష్ణన్ జీవితాన్ని ‘మేజర్’ పేరుతో శశికిరణ్ తిక్కా రూపొందించనుండగా, విక్రం బాత్రా కథను ‘షేర్‌షా’ పేరుతో విష్ణువర్ధన్ రూపొందిస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ 2020లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం.

ఇక్కడ ‘మేజర్’.. అక్కడ ‘షేర్‌షా’! | actioncutok.com

More for you: