ఐష్‌, నాని.. సేమ్ టు సేమ్‌!


ఐష్‌, నాని.. సేమ్ టు సేమ్‌!

ఐష్‌, నాని.. సేమ్ టు సేమ్‌!

22 ఏళ్ళ క్రితం విడుద‌లైన ‘ఇరువ‌ర్‌’ (1997) చిత్రంతో క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసింది మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యా రాయ్‌. ఇక 11 ఏళ్ళ క్రితం రిలీజైన ‘అష్టా చ‌మ్మా’ (2008)తో హీరోగా entry ఇచ్చిన వైనం నానిది. ఈ ఇద్ద‌రూ ఒకే సినిమాలో క‌ల‌సి న‌టించ‌క‌పోయినా.. ప్ర‌స్తుతం ఓ విష‌యంలో మాత్రం ఈ ఇద్ద‌రి తీరు ఒకేలా ఉంది. అదేమిటంటే.. త‌మ‌ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల కోసం ఈ ఇద్ద‌రు talented యాక్ట‌ర్స్‌.. విల‌న్స్‌గా ట‌ర్న్ అవుతున్నారు. 

ఐశ్వ‌ర్యా రాయ్ విష‌యానికి వ‌స్తే.. ‘ఇరువ‌ర్‌’ (తెలుగులో ‘ఇద్ద‌రు’), ‘గురు’ (తెలుగులో ‘గురుకాంత్‌’), ‘రావ‌ణ‌న్’ (తెలుగులో ‘విల‌న్‌’) చిత్రాల త‌రువాత త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో ‘పొన్నియ‌న్ సెల్వ‌న్‌’ అనే సినిమా చేయ‌బోతోంది.  అంతేకాదు.. త‌న‌ని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసిన మ‌ణి కోసం ఫుల్ లెంగ్త్ negative రోల్‌లో సంద‌డి చేయ‌బోతోంది ఐష్‌.

ఇక నాని విష‌యానికి వ‌స్తే.. ‘అష్టాచ‌మ్మా’తో త‌న‌ని హీరోగా ప‌రిచ‌యం చేసిన ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఆ మ‌ధ్య‌ ‘జెంటిల్‌మేన్’ కోసం కాస్త negative ట‌చ్ ఉన్న role చేసిన నాని.. ఇప్పుడు సెట్స్ పైనున్న ‘వి’ చిత్రంలో పూర్తి స్థాయి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌.

మ‌రి.. త‌మ మెంట‌ర్స్ కోసం negative ట‌ర్న్ తీసుకున్న ఈ ‘దేవ‌దాస్‌’ స్టార్స్  (ఒకే టైటిల్‌తో వేర్వేరు భాషల్లో రూపొందిన చిత్రాల్లో ఈ ఇద్ద‌రూ న‌టించారు) .. త‌మ విల‌నిజంతో ఏ మేర‌కు మెస్మ‌రైజ్ చేస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

ఐష్‌, నాని.. సేమ్ టు సేమ్‌! | actioncutok.com

More for you: