నమ్మండి.. నమ్మకపోండి: మోహన్‌బాబు, ఐశ్వర్యా రాయ్ జోడీ!

నమ్మండి.. నమ్మకపోండి: మోహన్‌బాబు, ఐశ్వర్యా రాయ్ జోడీ!
ఐశ్వర్యా రాయ్.. అందానికి ఐకాన్. ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకుంది మొదలు.. దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమల్లో కథానాయికగా జైత్రయాత్ర సాగించడం వరకు ఐశ్వర్య ప్రతీ అడుగు ఓ సంచలనమే, వార్తాంశమే. పెళ్ళయి ఓ బిడ్డకు తల్లయినా.. నాలుగు పదుల వయసు దాటినా.. ఈ వన్నె తరగని అందానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే.. ఆమె ఓ సినిమాలో నటిస్తోందంటే.. యావత్ భారతీయ చిత్ర సీమ ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐశ్వర్య. తన తొలి చిత్ర దర్శకుడు, మెంటర్ మణిరత్నం రూపొందించనున్న ‘పొన్నియన్ సెల్వమ్’లో ఓ ముఖ్య భూమిక పోషించనుందీ అందాల సుందరి. మణిరత్నం కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ హిస్టారికల్ డ్రామాలో.. రాజ్యాధికారం ఏమైనా చేసే నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో ఐశ్వర్య కనిపించనుంది. అంతేకాదు.. తెలుగు నటుడు మోహన్ బాబుకి జోడీగా ఐశ్వర్య కనిపిస్తుందని టాక్. ఏదేమైనా.. ఈ కాంబినేషన్ అనూహ్యమనే చెప్పాలి.
అమితాబ్ బచ్చన్, విక్రమ్, విజయ్ సేతుపతి, ‘జయం’ రవి, అనుష్క శెట్టి, కీర్తి సురేశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందించనున్నాడు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020లో రిలీజ్ కానుంది.
నమ్మండి.. నమ్మకపోండి: మోహన్‌బాబు, ఐశ్వర్యా రాయ్ జోడీ! | actioncutok.com
More for you: