అఖిల్ – భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది


అఖిల్ - భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది

అఖిల్ – భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించే సినిమా నిర్మాణ కార్యక్రమాలు శుక్రవారం లాంఛనంగా మొదలయ్యాయి. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ మనవరాలు బేబీ అన్విత క్లాప్ కొట్టగా, అల్లు అర్జున్ తనయుడు అయాన్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. అక్కినేని నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు.

అఖిల్ - భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది

ఫిలింనగర్ దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని అమల, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు అరవింద్ సతీమణి నిర్మల, డైరెక్టర్లు పరశురాం, శ్రీకాంత్ అడ్డాల, మారుతి హాజరయ్యారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బేనర్‌పై బన్నీ వాసు, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అఖిల్ - భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది

అఖిల్ – బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్

అక్కినేని నాగేశ్వ‌రావు, అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడిగా ప‌రిచ‌య‌మైన అఖిల్ త‌న‌ సినిమాల ద్వారా త‌న‌కంటూ  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. త‌ను చేసిన ‘హ‌లో’, ‘మిస్ట‌ర్ మ‌జ్ఞు’  లాంటి ల‌వ్ కమ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్స్ తో అక్కినేని అభిమానుల‌నే కాకుండా ఫ్యామిలి అండ్ గ‌ర్ల్స్ సెక్టార్ లో అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

అఖిల్ - భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది

‘బొమ్మ‌రిల్లు’ లాంటి చిత్రం ఇప్ప‌టికి ట్రెండ్ సెట్ట‌ర్ ఇన్ ల‌వ్ అండ్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా నిలిచిపోయిందంటే అది కేవ‌లం ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ విజ‌న్ అండ్ వాల్యూస్ అని చెప్పాలి. ఆ త‌రువాత వ‌చ్చిన ‘ప‌రుగు’ చిత్రం ప్ర‌తి ఓక్క‌రిని ఆలోచింప‌చేసేలా అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఫ్యామిలి ఆడియ‌న్స్ లో భాస్క‌ర్ ది సెప‌రేటు ఇమేజ్ వుంది. ఇప్ప‌డు వీర‌ద్దిరి కాంబినేష‌న్ లో చిత్రం అన‌గానే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తింది.

‘100% ల‌వ్’ త‌రువాత గీతా ఆర్ట్స్ లో అక్కినేని వారసుడు…

అఖిల్ - భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది

గ‌తంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో మెగా హీరోలు కాకుండా చేసిన చిత్రం ‘100% ల‌వ్‌’.. ఈ చిత్రం లో అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో బ‌న్ని వాసు నిర్మించాడు. ఈ చిత్రం చాలా మంచి విజ‌యాన్ని సాధించింది. మ‌ళ్లీ ఇప్పుడు అక్కినేని వారి మ‌రో న‌ట వార‌సుడు అఖిల్ అక్కినేని హీరోగా బ‌న్ని వాసు, వాసు వ‌ర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ‘100% ల‌వ్’కి మించి డ‌బుల్ హిట్ సాధిస్తుంద‌నే నమ్మకంతో యూనిట్ ఉంది.

అఖిల్ - భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది

తారగణం ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.మ‌ణికంద‌న్‌, సంగీతం: గోపిసుంద‌ర్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: భాస్క‌ర్‌.

అఖిల్ – భాస్కర్ సినిమా లాంఛనంగా మొదలైంది | actioncutok.com

More for you: