‘వెంకీ మామ‌’తో అక్కినేని ఫ్యామిలీ రేర్ ఫీట్!


'వెంకీ మామ‌'తో అక్కినేని ఫ్యామిలీ రేర్ ఫీట్!
Naga Chaitanya

‘వెంకీ మామ‌’తో అక్కినేని ఫ్యామిలీ రేర్ ఫీట్!

మిల‌టరీ, నేవీ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమాలకి  అక్కినేని family పెట్టింది పేరు. అందుకే.. ఆ నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటించడానికి అక్కినేని కుటుంబం ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది. అంతేకాదు.. ఆ బ్యాక్ డ్రాప్‌లో సాగే మూవీస్‌కి సంబంధించి అక్కినేని family మ‌రో ఫీట్‌ను కూడా త‌న సొంతం చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే.. అక్కినేని కుటుంబం తొలి తరం కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు ‘సిపాయి చిన్నయ్య’ (1969) సినిమాలో నేవీ ఆఫీసర్‌గా, సిపాయిగా ద్విపాత్రాభిన‌యం చేసి ప్రేక్షకుల మన్ననలను పొందారు. అలాగే ‘జై జ‌వాన్‌’ (1970) చిత్రంలోనూ జ‌వానుగా అల‌రించారు. ఇక  ఆ కుటుంబంలో రెండో తరం క‌థానాయ‌కుడిగా అక్కినేని నాగార్జున కూడా career ఆరంభంలో వచ్చిన ‘కెప్టెన్ నాగార్జున’లో పైలట్‌గా దర్శనమిచ్చాడు. అలాగే.. ‘ఎల్.ఓ.సి. కార్గిల్‌’, ‘నిన్నే ప్రేమిస్తా’ సినిమాల్లో ఆర్మీ ఆఫీసర్‌గా, ‘గగనం’ లో ఎన్.ఎస్.జి. కమాండర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

కట్ చేస్తే.. ఇప్పుడు అక్కినేని కుటుంబంలో మూడో తరం క‌థానాయ‌కుడైన నాగ చైతన్య కూడా ‘వెంకీమామ’ సినిమాలో army officer గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. మొత్త‌మ్మీద‌.. అక్కినేని కుటుంబం నుంచి మూడు త‌రాల క‌థానాయ‌కులు మిల‌ట‌రీ, నేవీ నేప‌థ్యంలో సాగే చిత్రాల్లో న‌టించి ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌మ సొంతం చేసుకున్నారు.

తాత, తండ్రి బాట‌లోనే వెళుతున్న‌ చైతు.. ‘వెంకీమామ’లో వీర‌సైనికుడిగా ఏ మేర‌కు అల‌రిస్తాడో చూద్దాం. అన్న‌ట్టు.. నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, నాగ్ మేన‌ల్లుడు సుమంత్ కూడా ‘యువ‌కుడు’ చిత్రంలో ఆర్మీ మేన్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు.

‘వెంకీ మామ‌’తో అక్కినేని ఫ్యామిలీ రేర్ ఫీట్! | actioncutok.com

More for you: