సుక్కుని వెయిటింగ్‌లో పెట్టిన బ‌న్నీ?


సుక్కుని వెయిటింగ్‌లో పెట్టిన బ‌న్నీ?

సుక్కుని వెయిటింగ్‌లో పెట్టిన బ‌న్నీ?

‘నా పేరు సూర్య‌’.. అల్లు అర్జున్ ఎంతో ఇష్ట‌ప‌డి, మ‌రెంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. త‌న కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుంద‌నుకున్న ఈ చిత్రం.. అనూహ్యంగా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో.. సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు బ‌న్నీ. ఈ నేప‌థ్యంలోనే.. దాదాపు ఏడాది విరామం త‌రువాత మూడు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త్రివిక్ర‌మ్‌, సుకుమార్, వేణు శ్రీ‌రామ్‌.. ఇలా ముగ్గురు ద‌ర్శ‌కుల‌కు ఓకే చెప్పాడు అల్లు అర్జున్‌.

ఇటీవ‌లే త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్కింది. సెప్టెంబ‌ర్ క‌ల్లా ఈ సినిమా పూర్త‌వుతుంద‌ని.. ఏడాది చివ‌ర‌లో లేదా 2020 సంక్రాంతికి ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రిలీజ్ కావ‌చ్చ‌ని స‌మాచారం. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కార‌మైతే.. ఈ ప్రాజెక్ట్ త‌రువాత సుకుమార్ చిత్రం చేయాలి బ‌న్నీ. అయితే.. ఇంకా బౌండ్ స్క్రిప్ట్  సిద్ధం కాక‌పోవ‌డంతో.. ఈ లోపు వేణు శ్రీ‌రామ్ ‘ఐకాన్‌’ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జోరుగా జ‌రుపుకుంటుండంతో.. త్రివిక్ర‌మ్ సినిమా కాగానే ‘ఐకాన్‌’ని మొద‌లుపెట్టి వేస‌వికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట బ‌న్నీ.

దీంతో.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కథకి తెర‌రూపం ఇవ్వ‌డానికి సుక్కుకి మ‌రో ఏడాది స‌మ‌యం నిరీక్ష‌ణ త‌ప్పదంటున్నారు గీతా కాంపౌండ్ జ‌నాలు. మొత్తానికి..  బౌండ్‌ స్క్రిప్ట్ చేతికి వ‌స్తే గానీ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన బ‌న్నీ తీరు.. సుక్కుని వెయింటింగ్‌లో  పెట్టింద‌న్న‌మాట‌. మ‌రి.. త‌న తొలి చిత్ర క‌థానాయకుడి కోసం సుక్కు ఏడాది స‌మ‌యం కేటాయిస్తాడా?  లేక‌పోతే మ‌హేశ్‌కి హ్యాండ్ ఇచ్చిన‌ట్టే బ‌న్నీకి కూడా హ్యాండ్ ఇచ్చి మ‌రో హీరో వెంట‌ప‌డ‌తాడా? అంటూ చెవులు కొరుక్కుంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు.

సుక్కుని వెయిటింగ్‌లో పెట్టిన బ‌న్నీ? | actioncutok.com

More for you: