‘దేశ‌ముదురు’ త‌రువాత మళ్లీ ఇప్పుడు!


'దేశ‌ముదురు' త‌రువాత మళ్లీ ఇప్పుడు!
Allu Arjun

‘దేశ‌ముదురు’ త‌రువాత మళ్లీ ఇప్పుడు!

‘నా పేరు సూర్య‌’ త‌రువాత భారీ విరామం తీసుకున్న అల్లు అర్జున్‌.. తాజాగా  మూడు చిత్రాల‌కు క‌మిట్ అయ్యాడు. త్రివిక్ర‌మ్‌, సుకుమార్‌, వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ద‌రు మూడు చిత్రాలు తెర‌కెక్కనున్నాయి. కాగా.. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి.. ద‌స‌రా సీజ‌న్‌లో రిలీజ్ చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే.. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా.. న‌ర‌సింహారెడ్డి’ కూడా అదే స‌మ‌యంలో విడుద‌ల కావ‌డం ప‌క్కా కావ‌డంతో.. ఆ ఆలోచ‌న‌ను ప‌క్క‌న‌పెట్టి సంక్రాంతి సీజ‌న్‌కి ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాయ‌ట  గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు.

అదే గ‌నుక నిజ‌మైతే.. ‘దేశ‌ముదురు’ త‌రువాత సంక్రాంతి సీజ‌న్‌లో బ‌న్నీ హీరోగా వ‌చ్చే సినిమా ఇదే అవుతుంది. మ‌ధ్య‌లో ‘ఎవ‌డు’ వ‌చ్చినా అందులో త‌న‌ది అతిథి పాత్ర కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి.. క‌లిసొచ్చిన సీజ‌న్‌లో బ‌న్నీ మ‌రోసారి స‌క్సెస్ అందుకుంటాడేమో చూడాలి. 

‘దేశ‌ముదురు’ త‌రువాత మళ్లీ ఇప్పుడు! | actioncutok.com