‘ఏబీసీడీ’ ఫెయిల్యూర్‌ను ఒప్పుకున్న అల్లు శిరీష్!


'ఏబీసీడీ' ఫెయిల్యూర్‌ను ఒప్పుకున్న అల్లు శిరీష్!
Allu Sirish

‘ఏబీసీడీ’ ఫెయిల్యూర్‌ను ఒప్పుకున్న అల్లు శిరీష్!

కచ్చితంగా సక్సెస్‌ను అందిస్తుందనే ఉద్దేశంతో మలయాళం హిట్ సినిమా ‘ఏబీసీడీ’ని అదే పేరుతో తెలుగులో చేశాడు అల్లు శిరీష్. కానీ తెలుగులో ఆ సినిమా వర్కవుట్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర ‘ఏబీసీడీ’ బోల్తా కొట్టింది. యూట్యూబ్‌లో ‘మెల్ల మెల్లగా’ సాంగ్ సూపర్ పాపులర్ అవడంతో సినిమా కూడా అదే విధంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశించిన శిరీష్‌కు ఆశాభంగమే ఎదురైంది.

ఆ సినిమా వైఫల్యాన్ని ఎట్టకేలకు అంగీకరించిన అతను ప్రేక్షకుల్ని ఆకట్టుకోడానికి మునుముందు మరింత కష్టపడతానని చెప్పాడు. సోషల్ మీడియాలో తనను అనుసరించేవాళ్లకు ఒక లెటర్ రాసిన అతను మంచి సినిమాలు ఇస్తానని వాళ్లకు వాగ్దానం చేశాడు.

‘ఏబీసీడీ’ ఫెయిల్యూర్‌ను ఒప్పుకున్న అల్లు శిరీష్! | actioncutok.com

More for you: