నాని చూపు.. ఆ రెండింటిపై!

నాని చూపు.. ఆ రెండింటిపై!
‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’.. ఇలా ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు నాని. 36 ఏళ్ల వయసు క్రికెటర్ అర్జున్‌గా నాని నటించిన ‘జెర్సీ’ ఏప్రిల్ 19న విడుదల కాగా.. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ ఆగస్టు 30న రిలీజ్ కానుంది. ఇక నెగటివ్ టచ్ ఉన్న రోల్లో నటిస్తున్న ‘వి’ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా.. నాలుగు నెలలకో సినిమా అన్నట్లుగా పక్కాగా ప్రణాళిక వేసుకున్నాడు నాని.
ఇదిలా ఉంటే.. ఒక వైపు ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’ చిత్రాలతో బిజీగా ఉంటూనే.. మరో రెండు ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాడట నాని. అందులో ఒకటి ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్‌తో కాగా.. మరొకటి ‘నా పేరు సూర్య’ ఫేమ్ వక్కంతం వంశీతో అని టాక్. నాని ఇమేజ్, బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఈ ఇద్దరు దర్శకులు కథలను సిద్ధం చేశారట.
అంతేకాదు.. పరశురామ్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుండగా.. వక్కంతం వంశీ సినిమాని బండ్ల గణేశ్ ప్రొడ్యూస్ చేస్తాడని ఫిల్మ్‌నగర్ ఇన్ఫర్మేషన్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ వస్తుంది. మొత్తానికి.. విరామమే లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు నాని.
నాని చూపు.. ఆ రెండింటిపై! | actioncutok.com
More for you: