తిరుమలకు మరో ఘాట్ రోడ్డు


తిరుమలకు మరో ఘాట్ రోడ్డు

తిరుమల: నానాటికి పెరుగుతున్న భక్తుల సంఖ్య ను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ బోర్డు యోచిస్తోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో సర్వే నిర్వహించిన ఎల్అండ్ టీ మరో వారంలో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులకు నివేదికను అందించనున్నట్లు సమాచారం. ఈ కొత్త రోడ్డు ను  2.1 కిలోమీటర్ల దూరంతో నాలుగు వరుసలుగా నిర్మించనున్నట్లు  తెలుస్తోంది.

ిరుమల: నానాటికి పెరుగుతున్న భక్తుల సంఖ్య ను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ బోర్డు యోచిస్తోంది. ఇప్పటికే చెన్నైకి చెందిన ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో సర్వే నిర్వహించిన ఎల్అండ్ టీ మరో వారంలో టీటీడీ ఇంజినీరింగ్ అధికారులకు నివేదికను అందించనున్నట్లు సమాచారం. ఈ కొత్త రోడ్డు ను  2.1 కిలోమీటర్ల దూరంతో నాలుగు వరుసలుగా నిర్మించనున్నట్లు  తెలుస్తోంది.

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే  రెండో ఘాట్ రోడ్డులో  13వ కిలోమీటర్ వద్ద  ప్రారంభమయ్యే ఈ  కొత్త దారి, జీఎన్సీ టోల్ గేట్ వరకూ ఉంటుంది. సరిగ్గా 13వ కిలోమీటర్ నుంచే రెండు రహదారులను కలిపే లింక్ రోడ్ ఉంది. ఇక కొత్త రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్ల వరకూ అవసరమని, కొన్ని చోట్ల నేలను చదును చేయాల్సి వున్నందున మరో రూ. 2 కోట్ల వరకూ అంచనా వ్యయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, కొత్త ప్రభుత్వంకొలువు తీరిన  తరువాత మాత్రమే పాలకమండలి ఈ కొత్త రోడ్డు నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Trending now: