‘సైరా’ కోసం మరోసారి క‌త్తి ప‌ట్టిన సూపర్ హీరోయిన్?


‘సైరా’ కోసం మరోసారి క‌త్తి ప‌ట్టిన సూపర్ హీరోయిన్?

‘సైరా’ కోసం మరోసారి క‌త్తి ప‌ట్టిన సూపర్ హీరోయిన్?

తెలుగునాట ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చింది అనుష్క. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి 2 – ది కంక్లూజ‌న్‌’ చిత్రాల్లో కత్తి పట్టి వీరనారి అనిపించుకున్న అనుష్క.. తాజాగా మరోమారు తల్వారు చేతపట్టిందని టాలీవుడ్ టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. బ్రిటీష్ ప్ర‌భుత్వాన్ని గడగడలాడించిన తొలి  తెలుగు పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ  సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.  న‌య‌న‌తార‌, త‌మ‌న్నా నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ఓ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో అనుష్క పాత్ర‌ కూడా నరసింహారెడ్డితో కలసి కత్తి పట్టి బ్రిటీష్ వారితో యుద్ధం చేస్తుందట. అందుకే ఆ పాత్రతోనే న‌ర‌సింహారెడ్డి కథను నేరేట్ చేయిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పాత్రకి సంబంధించిన సన్నివేశాలను అనుష్క పూర్తి చేసిందని సమాచారం. అయితే.. ఈ చిత్రంలో అనుష్క పాత్రకి సంబంధించి అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ లేదు.  త్వరలోనే అనుష్క ఎంట్రీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో చూడాలి.    

కాగా.. ‘సైరా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

‘సైరా’ కోసం మరోసారి క‌త్తి ప‌ట్టిన సూపర్ హీరోయిన్? | actioncutok.com

More for you: