ఆమెతో ప్రభాస్‌కి గొడవా?


ఆమెతో ప్రభాస్‌కి గొడవా?

ఆమెతో ప్రభాస్‌కి గొడవా?

సినిమా sets పై హీరో హీరోయిన్ల మధ్య గొడవలు అవడం భానుమతి, జమున కాలం నుంచి మనం వింటున్నాం. చిరంజీవి, మాధవి మధ్య కూడా చాలా కాలం మాటల్లేవనీ, ఆ స్థితిలోనే ఆ ఇద్దరూ ‘ఖైదీ’ చేశారనీ మనం చదువుకున్నాం. ఇప్పుడు కూడా అలాంటి వార్త ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ‘సాహో’ sets పై హీరో హీరోయిన్లు ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని!

ఇటీవల జరిగిన షూటింగ్‌లో ఇద్ధరి మధ్యా దేని గురించో వాదన జరిగిందనీ, మాటా మాటా అనుకున్నారనీ ప్రచారంలోకి వచ్చింది. దానిని బలపరుస్తూ ఒక కథ కూడా వినిపిస్తోంది. ప్రభాస్ నటించేప్పుడు director సుజీత్ single టేక్‌లోనే ఓకే చేస్తుంటే, శ్రద్ధ నటించేప్పుడు టేకుల మీద టేకులు చెప్తున్నాడంట. దీనిపై సుజీత్‌ను శ్రద్ధ అడిగేసరికి, సుజీత్‌కు మద్దతుగా ప్రభాస్ మాట్లాడాడంట. ఇది శ్రద్ధకు కోపం తెప్పించి ప్రభాస్‌తో వాదనకు దిగిందంట.

ఎంత ‘బాహుబలి’గా కండల వీరుడిగా తెరపై పోరాటాలు చేసినా, వాస్తవానికొచ్చేశరికి ప్రభాస్‌కు చాలా సౌమ్యుడనే పేరుంది. సహజంగానే అతను స్నేహపాత్రుడనీ, అలాంటివాడు శ్రద్ధతో వాదనకు దిగాడంటే నమ్మడం కష్టమనీ ఫిలింనగర్ వర్గాల మాట. అదే నిజమని కూడా అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ఈ rumour ఎలా పుట్టిందో కానీ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

ఆమెతో ప్రభాస్‌కి గొడవా? | actioncutok.com

More for you: