నేను బతికుండటానికి కారణం రాజీవ్ గాంధీ!


నేను బతికుండటానికి కారణం రాజీవ్ గాంధీ!
Atal Bihari Vajpayee

నేను బతికుండటానికి కారణం రాజీవ్ గాంధీ!

అటల్ బిహారీ వాజ్‌పేయీ అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ ఇష్టపడే మహానేత. బీజేపీ వ్యవస్తాపకుల్లో ఒకరైన అటల్ గత ఏడాది ఆగస్టులో 93 ఏళ్ల వయసులో మృతి చెందారు. బీజేపీని పార్లమెంటులో సునిశితంగా ఎదుర్కొనే ఒకప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఒక్క వాజ్‌పేయి విషయంలో చాలా మర్యాదగా నడచుకొనేవారు. వాజ్‌పేయి వ్యక్తిత్వం అలాంటిది.

ఒక సందర్భంలో తాను బతికుండటానికి కారణం రాజీవేనని వాజ్‌పేయి చెప్పారు. యు.ఎస్.లో తనకు మూత్రపిండాల మార్పిడి జరగడంలో రాజీవ్ సాయపడ్డారని ఆయన తెలిపారు. ఈ విషయాల్ని “ది అన్‌టోల్డ్ వాజ్‌పేయీ: పొలిటీషియన్ అండ్ పారడాక్స్” అనే పుస్తకంలో రచయిత ఉల్లేఖ్ ఎన్.పి. తెలియజేశారు.

“రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నాకు కిడ్నీ సమస్య ఉందనీ, విదేశాల్లో చికిత్స అవసరమని ఆయంకెలాగో తెలిసింది. ఒకరోజు ఆయన నన్ను తన ఆఫీసుకు పిలిపించుకున్నారు. ఐక్యరాజ్య సమితి సదస్సుకు వెళ్లే భారతీయ ప్రతినిధుల్లో నా పేరు చేరుస్తున్నాననీ, ఆ పర్యటనను నా చికిత్సకు వినియోగించుకొమ్మనీ సూచించారు. దాంతో నేను న్యూయార్క్‌కు వెళ్లాను. నేనివాళ బతికుండటానికి అదే కారణం” అని వాజ్‌పేయి వివరించినట్లు ఆ పుస్తకం పేర్కొంది.

1984 నుంచి 1989 వరకు ప్రధాని పదవిలో రాజీవ్ ఉన్నారు. వాజ్‌పేయి చికిత్స పూర్తి చేసుకున్న తర్వాతనే భారత్‌కు ఆయన తిరిగి వచ్చే ఏర్పాట్లు చేయమని అధికారుల్ని రాజీవ్ ఆదేశించారు. అప్పుడు వాజ్‌పేయి విపక్ష నేతగా ఉండటం గమనార్హం.

Trending now: