కర్ణాటకలో తెలుగు హాస్యనటుడి ప్రచారం


కర్ణాటకలో తెలుగు హాస్యనటుడి ప్రచారం

కర్ణాటకలో తెలుగు హాస్యనటుడి ప్రచారం

బెంగళూరు (శివాజీనగర): కర్ణాటకలో  చించోలి, కల్బుర్గి  నియోజక వర్గాలకు త్వరలో ఉపఎన్నికలు  జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం కోసం బీజేపీ తెలుగు సినీ హాస్య నటుడు బాబూ మోహన్ ను రంగంలోకి దింపింది

ఆయన బుధవారం చించోలి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. చించోలి, కల్బుర్గి జిల్లాల్లో పొరుగున ఉన్న తెలంగాణ జిల్లాలకు చెందిన తెలుగువారు వేల సంఖ్యలో ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు బాబూ మోహన్ ప్రచారం చేస్తున్నారు.

చించోళిలో పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప కొంత సమయం ప్రచారం చేసిన అనంతరం తెలంగాణలోని తాండూరు వెళ్లారు. చించోళికి చెందిన 3వేల మంది ఓటర్లు  ఉపాధి కోసం అక్కడకు వెళ్లారు. యడ్యూరప్ప వెంట పార్టీ అభ్యర్థి ఉమేశ్‌ జాదవ్‌, నాయకుడు  అరవింద లింబావళి తదితరులు ఉన్నారు.

కర్ణాటకలో తెలుగు హాస్యనటుడి ప్రచారం | actioncutok.com

Trending now: