కాజ‌ల్‌తోనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌


కాజ‌ల్‌తోనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌

కాజ‌ల్‌తోనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌

‘సీత‌’.. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించిన తొలి తెలుగు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌.  బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్, మ‌న్నారా చోప్రా, సోనూసూద్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క్యారెక్ట‌ర్ డ్రివెన్ ఫిల్మ్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే 24న విడుదల కానుంది.

కాగా.. ఎలాంటి అంచ‌నాల్లేకుండా రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. అటు తేజ‌కి, ఇటు బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌కి కీల‌కంగా మారింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ విజ‌యం సాధించినా ఆ క్రెడిట్ అంతా ఆ చిత్ర క‌థానాయ‌కుడు రానా అకౌంట్‌లో ప‌డిపోవ‌డంతో.. తేజ‌కి ‘సీత‌’ రిజ‌ల్ట్ చాలా ఇంపార్టెంట్ అయ్యింది.

ఇక బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ సంగ‌తి తీసుకుంటే.. త‌న ఖాతాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా ప‌డ‌లేదు. ఇలాంటి నేప‌థ్యంలో.. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజ‌ల్ స్టార్‌డమ్మే ఈ సినిమా బాక్సాఫీస్‌కి ఊపిరిగా నిలుస్తోంది. దీంతో.. కాజ‌ల్‌పైనే డిపెండ్ అయ్యారు తేజ‌, సాయిశ్రీ‌నివాస్‌.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. కాజ‌ల్‌తో ‘నేనే రాజు నేనే మంత్రి’ త‌రువాత‌ తేజ‌, ‘క‌వ‌చం’ త‌రువాత బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ వెంట‌వెంట‌నే చేసిన సినిమా ఇదే కావ‌డం విశేషం. మ‌రి.. కాజ‌ల్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేసిన ఈ ఇద్ద‌రికీ.. ఆమె కాంబినేష‌న్‌లో చేసిన రెండో చిత్రం ‘సీత‌’ మెమ‌ర‌బుల్ ఫిల్మ్ అవుతుందేమో చూద్దాం.

కాజ‌ల్‌తోనే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌ | actioncutok.com