బాల‌య్య సెంటిమెంట్లు ఫ‌లిస్తాయా?


మునుపు తనకు విజయాలు అందించిన దర్శకులతో వరుస సినిమాలు చేస్తున్న బాలకృష్ణ ఆ సినిమాలు వచ్చిన సీజన్లలోనే కొత్త సినిమాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

బాల‌య్య సెంటిమెంట్లు ఫ‌లిస్తాయా?
Balakrishna

బాల‌య్య సెంటిమెంట్లు ఫ‌లిస్తాయా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌కి ఇప్పుడు అర్జెంట్‌గా ఓ హిట్ అవ‌స‌రం. ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించి మ‌రీ న‌టించిన య‌న్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు ‘య‌న్‌.టి.ఆర్‌. క‌థానాయకుడు’, ‘య‌న్‌.టి.ఆర్‌. మ‌హానాయ‌కుడు’ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా విఫ‌ల‌మ‌వ‌డంతో..  త‌న త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు బాల‌య్య‌.

అందుకే.. త‌న‌కు క‌లిసొచ్చిన ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో వ‌రుస సినిమాలు చేయ‌బోతున్నాడు. అందులో ఒక‌టి కె.య‌స్‌.ర‌వికుమార్ చిత్రం కాగా.. మ‌రొక‌టి బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ ఫిల్మ్‌. త్వ‌ర‌లోనే ఈ రెండు సినిమాలు ప‌ట్టాలెక్క‌నున్నాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే.. ఈ రెండు సినిమాల‌ను కూడా ఆయా ద‌ర్శ‌కుల‌తో క‌లిసొచ్చిన సీజ‌న్‌ల్లోనే రిలీజ్‌కి ప్లాన్ చేశాడు బాలయ్య‌. ‘జై సింహా’ త‌రువాత కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో న‌టించ‌నున్న‌ సినిమా… ‘జై సింహా’ త‌ర‌హాలోనే సంక్రాంతిని టార్గెట్ చేసుకుంటే.. ‘సింహా’, ‘లెజెండ్‌’ త‌రువాత బోయ‌పాటి కాంబోలో న‌టించ‌నున్న‌ కొత్త చిత్రం కూడా ఆ సినిమాల త‌ర‌హాలోనే వేస‌వికి రాబోతోంది.

మ‌రి.. అచ్చొచ్చిన‌ ద‌ర్శ‌కుల‌తో, అది కూడా క‌లిసొచ్చిన సీజ‌న్స్‌లోనే రానున్న‌ బాల‌య్య‌కి సెంటిమెంట్లు ఫ‌లించి విజ‌యాలు ద‌క్కుతాయా? వేచి చూద్దాం.

బాల‌య్య సెంటిమెంట్లు ఫ‌లిస్తాయా? | actioncutok.com

Trending now: