బాలకృష్ణ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనా?


బాలకృష్ణ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనా?

బాలకృష్ణ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనా?

తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో బాలకృష్ణ చేయాలనుకున్న సినిమా ఆగిపోయిందా? ఇప్పుడు ఫిలింనగర్‌లో, social media లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. రెండు భాగాల ఎన్టీ రామారావు biopic ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ సినిమాలు box-office వద్ద డిజాస్టర్స్ కావడంతో అయోమయ స్థితిలో పడిన బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరింత అయోమయ స్థితిలోకి నెట్టివేశాయి.

ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా ఆయన పార్టీ టీడీపీ దారుణంగా ఓడిపోయింది. అదే ఇప్పుడు కె.ఎస్. రవికుమార్ సినిమా ఆగిపోవడానికి కారణమని వినిపిస్తోంది. ఎందుకంటే political బ్యాక్‌డ్రాప్‌తో ఆ సినిమా కథను రూపొందించడమే. ఎన్నికల్లో మళ్లీ టీడీపీ వస్తుందనే గట్టి నమ్మకంతోనే ఆ సినిమా చెయ్యడానికి బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారనీ, అందుకు అనుగుణంగా బోయపాటి శ్రీనుతో చెయ్యాలనుకున్న సినిమాని వెనక్కి నెట్టారనీ అంతర్గత వర్గాల సమాచారం.

టీడీపీ దెబ్బతిని ఉన్న ప్రస్తుత స్థితిలో political సినిమా చేస్తే హాస్యాస్పదంగా ఉంటుందని బాలకృష్ణ భావిస్తున్నారనీ, అందుకే ఆ సినిమాని పక్కన పెట్టారనీ ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఎంపిక చేసినట్లు రెండు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అంతలోనే ఆ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారంలోకి వచ్చింది.

ఈ ప్రచారంలో నిజముందా, కేవలం వదంతేనా అనే విషయం అతి త్వరలోనే వెల్లడి కానున్నది.

బాలకృష్ణ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనా? | actioncutok.com

More for you: