బావతో బాలయ్య భేటీ


బావతో బాలయ్య భేటీ

బావతో బాలయ్య భేటీ

అమరావతి :  తెలుగు దేశం పార్టీ  అధినేత చంద్రబాబు తో  ఆ పార్టీ నాయకుడు, సినీ నటుడు బాలకృష్ణ శుక్రవారం ఇక్కడ సమావేశమై ఎన్నికల ఫలితాలు, పార్టీ ఓటమికి గల కారణాలను చర్చించినట్లు సమాచారం. పార్టీ  ఓడిపోయిన తర్వాత మొదటి సారి బాలయ్య, చంద్రబాబు కలిశారు.

కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు, అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గం నుంచి బాలకృష్ణ విజయం సాధించిన విషయం తెలిసిందే. మంగళగిరి నుంచి చంద్రబాబు కుమారుడు  లోకేష్, విశాఖ నుంచి  బాలయ్య చిన్నల్లుడు భరత్ ఓటమి చవిచూశారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఐదు సార్లు విజయ దుందుభి మోగించిన ఆ పార్టీ తాజా ఫలితాలతో కలిపి నాలుగు పర్యాయాలు ఓడిపోయింది.

తొలిసారిగా ఆ పార్టీ 1989లో ఓటమి పాలయింది. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి మళ్ళీ 2004లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత 2009లో,  ఇప్పుడు మరోసారి ఓడిపోయింది.

బావతో బాలయ్య భేటీ | actioncutok.com

More for you: