‘ల‌క్ష్మీ న‌ర‌సింహా’ బాట‌లో ‘రూల‌ర్‌’?


'ల‌క్ష్మీ న‌ర‌సింహా' బాట‌లో 'రూల‌ర్‌'?
Balakrishna

‘ల‌క్ష్మీ న‌ర‌సింహా’ బాట‌లో ‘రూల‌ర్‌’?

సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ‌కి పోలీస్ క‌థ‌లు బాగా క‌లిసొచ్చాయి. ముఖ్యంగా.. ‘రౌడీ ఇన్స్‌పెక్ట‌ర్‌’, ‘ల‌క్ష్మీ న‌ర‌సింహా’ వంటి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ స్టోరీస్ బాల‌య్య‌కు మెమ‌ర‌బుల్ హిట్స్ అందించాయి. ఈ నేప‌థ్యంలో.. మ‌రో పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌తో రాబోతున్నాడు బాల‌య్య‌. అంతేకాదు.. ‘ల‌క్ష్మీ న‌ర‌సింహా’ త‌ర‌హాలో లంచ‌గొండి పోలీస్ అధికారిగా కాస్త నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ‘జై సింహా’ త‌రువాత కె.య‌స్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ నంద‌మూరి హీరో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. సి. క‌ళ్యాణ్ నిర్మించ‌నున్న‌ ఈ చిత్రంలో బాల‌య్య లంచ‌గొండి పోలీస్ అధికారి పాత్ర‌ చేస్తున్నాడ‌ట‌. అలాగే.. ఈ చిత్రానికి ‘రూల‌ర్‌’ అనే పేరు ప‌రిశీలిస్తున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. త్వ‌ర‌లోనే టైటిల్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఈ నెల 17న ప్రారంభం కానున్న ఈ చిత్రం.. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. అలాగే.. నాలుగు నెల‌ల్లో ఈ సినిమాని పూర్తిచేసి.. ఆ త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను చిత్రంపై దృష్టి సారించ‌బోతున్నాడ‌ట బాల‌య్య‌. మొత్త‌మ్మీద‌..  త‌క్కువ గ్యాప్‌లోనే బాల‌య్య రెండు చిత్రాల‌తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడ‌న్న‌ మాట‌.

‘ల‌క్ష్మీ న‌ర‌సింహా’ బాట‌లో ‘రూల‌ర్‌’? | actioncutok.com

Trending now: