మూడు కొండలను ఢీకొట్టనున్న ‘బంగార్రాజు’!


మూడు కొండలను ఢీకొట్టనున్న 'బంగార్రాజు'!

మూడు కొండలను ఢీకొట్టనున్న ‘బంగార్రాజు’!

ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమా చేస్తోన్న నాగార్జున.. దాని తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’కు sequel అయిన ‘బంగార్రాజు’ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఒరిజినల్‌ను direct చేసిన కల్యాణ్ కృష్ణ ఈ సినిమానీ డైరెక్ట్ చేయనున్నాడు. కాగా ఒరిజినల్ తరహాలోనే sequel ని కూడా సంక్రాంతి సీజన్‌లో విడుదల చెయ్యాలని నాగార్జున భావిస్తున్నట్లు సమాచారం.

2016లో జనవరి 15న విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమాల పోటీని తట్టుకొని సంక్రాంతి విజేతగా నిలిచింది. అంతేకాదు, నాగార్జున career లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా record సాధించింది. కల్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమైంది ఆ సినిమాతోటే.

సెంటిమెంట్‌గా ‘బంగార్రాజు’ను కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నాగార్జున భావిస్తున్నారు. అదే జరిగితే ఈసారీ ఆయన పెద్ద సినిమాలతో పోటీపడక తప్పదు. ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేశ్ చేస్తోన్న సినిమా సంక్రాంతిని target చేసుకోగా, త్రివిక్రం డైరెక్షన్‌లో అల్లు అర్జున్ చేస్తోన్న సినిమా సైతం అప్పుడే రానుంది. వీటికి తోడు రజనీకాంత్ సినిమా ‘దర్బార్’ కూడా అదే సీజన్‌లో రానుండటంతో ఏకంగా మూడు క్రేజీ, బిగ్ మూవీస్‌తో నాగ్ తలపడాల్సి ఉంటుంది. ఈసారి పోటీలో ‘బంగార్రాజు’ నిలవగలడా?.. అనేదే ప్రశ్న.

మూడు కొండలను ఢీకొట్టనున్న ‘బంగార్రాజు’! | actioncutok.com

More for you: