‘సాహో’కి అటు, ఇటు..

‘సాహో’కి అటు, ఇటు..
‘బాహుబలి’ series తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో market సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ next ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘సాహో’పై భారీ అంచనాలే ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. ఆ క్రేజ్‌కు తగ్గట్టే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది.
కాగా.. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న release చేయబోతున్నారు. ‘బాహుబలి – ది కంక్లూజన్’ అనంతరం రెండేళ్ళకు పైగా gap తీసుకుని ప్రభాస్ నుంచి వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి పోటీగా.. పంద్రాగస్టున మరే తెలుగు చిత్రం release కావడం లేదు.

అయితే.. ‘సాహో’కి రెండు వారాల ముందు, తరువాత ఇద్దరు యువ కథానాయకులు తమ కొత్త చిత్రాలతో పలకరించబోతున్నారు. వారే.. శర్వానంద్, నాని. ‘రణరంగం’ పేరుతో వస్తున్న శర్వానంద్ కొత్త చిత్రం.. ‘సాహో’ కంటే రెండు వారాల ముందు అంటే ఆగస్టు 2న release కానుండగా.. నాని తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ఏమో ‘సాహో’ రిలీజైన రెండు వారాల తరువాత ఆగస్టు 30న విడుదల కానుంది. మరి.. ‘సాహో’ క్రేజ్ ముందు ఈ medium budget సినిమాలు తమ ఉనికిని ఏ మేరకు నిలబెట్టుకుంటాయో చూడాలి.

‘సాహో’కి అటు, ఇటు.. | actioncutok.com
More for you: