‘సీత’ ఫ్లాపవుతుందని బెల్లంకొండకు ముందే తెలుసు!


'సీత' ఫ్లాపవుతుందని బెల్లంకొండకు ముందే తెలుసు!

‘సీత’ ఫ్లాపవుతుందని బెల్లంకొండకు ముందే తెలుసు!

తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ‘సీత’ గత వారం విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా పల్టీ కొట్టింది. దీంతో ఆ సినిమాకు ముందు వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ విజయం తేజకు గాలివాటుకు వచ్చిందనే ముద్ర పడింది. కాగా ఈ సినిమాలో హీరోగా నటించినందుకు బెల్లంకొండ శ్రీనివాస్ పశ్చాత్తాపపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కారణం అందులో నటించవద్దని ముందుగానే అతని తండ్రి బెల్లంకొండ సురేశ్ హెచ్చరించాడు. అదే సమయంలో వచ్చిన మరో సినిమాను చెయ్యమని కొడుక్కు సలహా ఇచ్చాడు. కానీ ‘నేనే రాజు నేనే మంత్రి’ సక్సెస్‌లో ఉన్న తేజ సినిమాకే ఓటేశాడు శ్రీనివాస్.

‘సీత’ కథ, ఆ కథలో శ్రీనివాస్ కేరెక్టర్ బెల్లంకొండ సురేశ్‌కు ఏమాత్రం నచ్చలేదనీ, ఆ సినిమా హిట్టయ్యే అవకాశాలు లేవనీ ఆయన ముందుగానే పసిగట్టారనీ, అందుకే కొడుకును ఆ సినిమా చేయవద్దని సూచించాడనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కారణం వల్లే ఆ సినిమాకి సంబంధించిన అన్ని ఈవెంట్లకూ ఆయన దూరంగా ఉన్నాడు.

సినిమా విడుదలయ్యాక తండ్రి మాటే నెగ్గడంతో శ్రీనివాస్ హతాశుదయ్యాడనీ, తండ్రి మాటను కాదని ‘సీత’ను చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నాడనీ ఆ వర్గాలు తెలిపాయి.

‘సీత’ ఫ్లాపవుతుందని బెల్లంకొండకు ముందే తెలుసు! | actioncutok.com

More for you: