బద్ధ శత్రువులు చేతులు కలిపారు!


బద్ధ శత్రువులు చేతులు కలిపారు!
Babulal Marandi and Shibu Soren

బద్ధ శత్రువులు చేతులు కలిపారు!

రాంచి (జార్ఖండ్): జార్ఖండ్ రాజకీయాల్లో పెను సంచలనం… రాజకీయంగా బద్ధ విరోధులైన ఇద్దరు నేతలు చేతులు కలిపారు. ఒకరు- జేవీఎం పార్టీ అధినేత బాబూలాల్ మరాండీ.. మరొకరు –  జేఎంఎం అధినేత శిబూ సోరెన్. ఆదివాసీ నేతల్లో ఇద్దరూ ఉద్దండులే.రాజకీయ గురువైన శిబూసోరెన్ ను  ఓడించి తన సత్తాచాటిన నాయకుడు  బాబూలాల్ మరాండీ.

అంతటి బద్ధ రాజకీయ విరోధులు ఎన్నికల ప్రచారం చివరి రోజు శుక్రవారం  ఒకే వేదికపై కనిపించి  జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించారు. పాల్గొనడమే కాదు, ఏకంగా శిబూసోరెన్‌కు ప్రజలందరూ మద్దతు పలకాలని బాబులాల్ పిలుపునివ్వడంతో ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. బీజేపీని చిత్తుగా ఓడించడానికే  తాము కలిశామని మరాండీ ప్రకటించారు. గతంలో  తాము రాజకీయ విరోధులుగా ఉండేవారమని, కానీ కేంద్రంలో బీజేపీని గద్దె దించడానికి ఇపుడు చేతులు కలిపామని అన్నారు.

తనకు పడే 1.58 లక్షల ఓట్లను  గురూజీ శిబూసోరెన్ కు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని  మరాండీ ప్రజలకు పిలుపునివ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్న రాజకీయ సామెతకు వీరి ఐక్యతే తార్కాణం.

బద్ధ శత్రువులు చేతులు కలిపారు! | actioncutok.com

More for you: