ఆమె తరహాలోనే నా హత్యకు కుట్ర!


ఆమె తరహాలోనే నా హత్యకు కుట్ర!

ఆమె తరహాలోనే నా హత్యకు కుట్ర!

ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆయనపై దాడి చేశాడు. మోతీనగర్ లో ఓపెన్‌టాప్‌ జీపులో కేజ్రీవాల్‌ పర్యటిస్తుండగా ఎర్రరంగు టీషర్టు ధరించిన అగంతకుడొకడు ఆప్‌ కార్యకర్తలందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని అనుమానిస్తున్నారు.

శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రాణాలు తీసినట్లుగానే తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు బీజేపీ తనను హత్య చేయిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందిరా గాంధీని వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంపినట్లు గానే తనను  ఏదోక రోజు  హత్య చేస్తారంటూ కేజ్రీవాల్‌ అనుమానం  వ్యక్తం చేశారు.

తనకు సంబంధించిన సమాచారాన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది బీజేపీకి చేరవేస్తున్నట్లు  కేజ్రీవాల్ ఆరోపించారు. ఏదో ఒక రోజు ఇందిరాగాంధీలాగే నన్నూ వ్యక్తిగత కాపలాదారులే  హతమారుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆమె తరహాలోనే నా హత్యకు కుట్ర! | actioncutok.com

More for you: