ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోండి!


ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోండి!
Amit Shah

ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోండి!

కానింగ్‌ (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్లో ర్యాలీలు నిర్వహించకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకోగలరేమో కానీ బీజేపీ  విజయాన్ని మాత్రం ఆపలేరని ఆ పార్టీ  జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ జాయ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని కానింగ్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో  అమిత్‌షా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా జై శ్రీరాం అంటే మమతా బెనర్జీకి కోపం వస్తుందని,  ఈ రోజు ఇక్కడ ఇంతమంది ముందు నేను జై శ్రీరాం అని గట్టిగా అంటున్నాను. ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేసుకోవచ్చునని,  నేను మరో 24 గంటలు కోల్‌కతాలోనే ఉంటానని  అంటూ మమతకు  అమిత్‌షా సవాల్ విసిరారు.

పశ్చిమ బెంగాల్లో ఒక  ఎన్నికల ర్యాలీలో  పాల్గొనేందుకు వస్తున్నఅమిత్‌షా ప్రయాణిస్తున్న  విమానాన్ని బరైపూర్‌లో దిగేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ధైర్యం ఉంటే అరెస్ట్ చేసుకోండి! | actioncutok.com

Trending now: