బడ్జెట్ తగ్గిస్తున్న బోయపాటి!


బడ్జెట్ తగ్గిస్తున్న బోయపాటి!
Boyapati Srinu

బడ్జెట్ తగ్గిస్తున్న బోయపాటి!

బోయ‌పాటి శ్రీ‌ను.. మాస్ సినిమాల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన ఈ జ‌న‌రేష‌న్ డైరెక్ట‌ర్‌. ఆరంభంలో వ‌రుస విజ‌యాల‌తో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన బోయ‌పాటి.. గ‌త కొంత‌కాలంగా ట్రాక్ త‌ప్పాడు. మితిమీరిన హింస‌తో తెర‌కెక్కించిన‌ ‘జ‌య జాన‌కి నాయ‌క‌’, ‘వినయ విధేయ రామ‌’ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరాతిఘోరంగా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో.. బోయ‌పాటిపై విమ‌ర్శ‌ల దాడి ఎక్కువైంది.

దానికితోడు.. త‌న‌కు క‌లిసొచ్చిన క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ‌తో చేయాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా ప‌డ‌డంతో సందిగ్ధంలో ప‌డిపోయాడు బోయపాటి. అయితే.. ఎట్టిప‌రిస్థితుల్లోనూ బౌన్స్ బ్యాక్ కావాల‌నుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌.. ఈ గ్యాప్‌ని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని రెడీ చేసుకుంటున్నాడ‌ని వినిపిస్తోంది.

అయితే.. ముందుగా అనుకున్న‌ట్లుగా రూ.70 కోట్ల బ‌డ్జెట్‌తో కాకుండా రూ.40 కోట్ల బ‌డ్జెట్‌లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడ‌ట బోయ‌పాటి. అంతేకాదు.. త్వ‌ర‌లోనే బాల‌య్య‌కి ఆ సబ్జెక్ట్‌ని వినిపించి.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కొత్త సినిమాని ప‌ట్టాలెక్కించేందుకు  బోయ‌పాటి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట.

ప్ర‌స్తుతం కె.య‌స్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అది పూర్త‌య్యేలోగా.. బోయ‌పాటి చిత్రం ప్రారంభ‌మ‌వుతుంది. వ‌చ్చే ఏడాది వేస‌వికి ఈ హిట్ కాంబినేష‌న్ ఫిల్మ్ తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మ‌రి..  బ్యాక్ టు బ్యాక్ స్ట్రోక్స్‌తో స్ట్ర‌గుల్ అవుతున్న బోయ‌పాటి.. కొత్త చిత్రంతో ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడో లేదంటే బౌన్స్ బ్యాక్ అయి వార్త‌ల్లో నిలుస్తాడో కాల‌మే నిర్ణ‌యించాల్సి ఉంది.

బడ్జెట్ తగ్గిస్తున్న బోయపాటి! | actioncutok.com

Trending now: