ఆంధ్రా ఎన్నికలు: రేపు 12 గంటలకి రిజల్ట్ ట్రెండ్ తెలిసిపోతుంది!


ఆంధ్రా ఎన్నికలు: రేపు 12 గంటలకి రిజల్ట్ ట్రెండ్ తెలిసిపోతుంది!
Gopal Krishna Dwivedi

ఆంధ్రా ఎన్నికలు: రేపు 12 గంటలకి రిజల్ట్ ట్రెండ్ తెలిసిపోతుంది!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్‌  ప్రారంభానికి  కొద్ది గంటల ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా వీవీప్యాట్ల  ఎంపిక జరుగుతుందని, వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కే ఫైనల్ అవుతుందని అన్నారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర సాంకేతిక సిబ్బంది కూడా ఉంటారని తెలిపారు. సర్వీస్ ఓట్లు, పోస్టల్ ఓట్లను ముందుగా లెక్కిస్తామని చెప్పారు.

మధ్యాహ్నం 12గంటల కల్లా ట్రెండ్స్ తెలిసిపోతాయని  వెల్లడించారు. ఫలితాల ప్రకటనకు మాత్రం రాత్రి అయ్యే అవకాశం ఉందని ద్వివేది పేర్కొన్నారు. రౌండ్‌ల వారీగా ప్రకటన ఉంటుందని చెప్పారు. వీవీప్యాట్ లెక్కలు వచ్చిన తర్వాత తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. కాగా.. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పోలీసు పరిశీలకుడు కేకే శర్మ బుధవారం ఇక్కడ ద్వివేదితో భేటీ అయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

కౌంటింగ్ కేంద్రాల దగ్గర బందోబస్తు కోసం రాష్ట్రానికి 90 కంపెనీల పారామిలటరీ బలగాలను వినియోగిస్తున్నట్లు శర్మ తెలిపారు. ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు 300 మంది పారామిలటరీ వారిని నియమించినట్లు చెప్పారు.

ఆంధ్రా ఎన్నికలు: రేపు 12 గంటలకి రిజల్ట్ ట్రెండ్ తెలిసిపోతుంది! | actioncutok.com