పాలిటిక్స్: ఎన్డీఏ యేతర ప్రభుత్వం కోసం బాబు వ్యూహం


ఎన్డీయే కూటమికి ఎదురుగాలి వీస్తోందని అంచనా వేస్తున్న చంద్రబాబు జాతీయస్థాయిలో విపక్షాలను ఒక గొడుగు కిందకు తీసుకురావడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఎన్డీఏ యేతర ప్రభుత్వం కోసం బాబు వ్యూహం

ఎన్డీఏ యేతర ప్రభుత్వం కోసం బాబు వ్యూహం

కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చూడటానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తనదయిన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా  తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు.

ఇప్పటికే మాజీ ప్రధాని, జెడి(ఎస్) అధినేత దేవెగౌడ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినాయకుడు స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ వంటి నేతలతో బాబు సమాలోచనలు జరిపారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఎదురుగాలి వీస్తోందని అంచనా వేస్తున్న చంద్రబాబు జాతీయస్థాయిలో విపక్షాలను ఒక గొడుగు కిందకు తీసుకురావడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21 న ఢిల్లీలో విపక్ష పార్టీల నేతలతో ఒక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

ఎన్డీఏ యేతర ప్రభుత్వం కోసం బాబు వ్యూహం | actioncutok.com

Trending now: