‘సైరా’లో ఆ కేరెక్టర్‌ను తగ్గించవద్దన్న చిరు!

‘సైరా’లో ఆ కేరెక్టర్‌ను తగ్గించవద్దన్న చిరు!
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘సైరా.. నరసింహారెడ్డి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్-ఇండియా అప్పీల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ సుదీప్, తెలుగు నటుడు జగపతిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటించగా.. అనుష్క అతిథి పాత్రలో దర్శనమివ్వనుంది.
ఇలా.. భారీ తారాగణంతో, అంతకుమించిన భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నో హైలైట్స్, మరెన్నో హంగులు ఉన్నా.. చిరు తరువాత ఈ సినిమాలో డామినేట్ చేసే పాత్ర మాత్రం విజయ్ సేతుపతిదేనట. అతను రాజా పాండి పాత్రలో కనిపించనున్నాడు. ఒక దశలో విజయ్ పాత్ర, నటన.. చిరు పాత్రని డామినేట్ చేస్తున్న తీరుని చూసి చిత్ర రచయితలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్.. ఆ పాత్రని కాస్త తగ్గిస్తే బాగుంటుందని చిరు దగ్గర ప్రస్తావించారట.
అయితే.. సినిమాకి హైలైట్స్‌గా నిలచే అంశాల్లో రాజా పాండి పాత్ర ఒకటని.. అలాగే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌ని ఎరికోరి ఎంచుకుంది కూడా సినిమా స్థాయిని మరింతగా పెంచేందుకేనని.. విజయ్ పాత్రని తగ్గించే ఆలోచన పెట్టుకోవద్దని సున్నితంగా చెప్పుకొచ్చాడట చిరు. అంతేకాదు.. ఎడిటింగ్‌లో కూడా అతని పాత్రని కత్తిరించే యోచనలు పెట్టుకోవద్దని తెలిపాడట. ఈ సంఘటనతో మంచి అవుట్‌పుట్ కోసం పరితపించే చిరు వ్యక్తిత్వం మరోసారి తేటతెల్లమైందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా.. దసరా సీజన్లో ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘సైరా’లో ఆ కేరెక్టర్‌ను తగ్గించవద్దన్న చిరు! | actioncutok.com