కాంగ్రెస్ పార్టీది 56 అంగుళాల హృదయం!


కాంగ్రెస్ పార్టీది 56 అంగుళాల హృదయం!
Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీది 56 అంగుళాల హృదయం!

ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌) : మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతుల రుణ మాఫీ పై అబద్దాలు మాట్లాడుతున్నారని, ఆయన కుటుంబ సభ్యులకు రైతు రుణాలను కూడా కమలనాథ్ ప్రభుత్వం రద్దు చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలను రాహుల్ చూపించారు.

ఉజ్జయినిలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. 56 అంగుళాల నరేంద్ర మోదీ ఛాతీ పై రాహు ల్  తనదైన శైలిలో విమర్శించారు. మోదీది 56 అంగుళాల ఛాతీ అయితే, కాంగ్రెస్ పార్టీది 56 అంగుళాల హృదయం అని, బీజేపీపై  ప్రేమతోనే గెలుస్తామని అన్నారు.

“తరచూ మా కుటుంబ సభ్యులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోదీ తల్లిదండ్రులను నేనెప్పుడూ ఎక్కడా అవమాన పరచలేదు. ఎందుకంటే నేను బీజేపీ మనిషిని కాదు, కాంగ్రెస్ మనిషిని” అని రాహుల్ అన్నారు. లోక్‌సభ చివరి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది.

కాంగ్రెస్ పార్టీది 56 అంగుళాల హృదయం! | actioncutok.com

Trending now: