క్రైం: కోరికలే గుర్రాలైతే…


క్రైం: కోరికలే గుర్రాలైతే...

క్రైం: కోరికలే గుర్రాలైతే…

బెంగళూరు : కోరికలే గుర్రాలైతే కడతేరిపోతారని చెప్పే సంఘటన ఇది. బరితెగించిన భార్యను భర్తే వేటకొడవలితో నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం … బెంగుళూరు జిల్లా కేంద్రం సమీపం లోని వేపాలంపట్టి గ్రామానికి చెందిన ఓ యువకుడికి  భార్య, ఇద్దరు బిడ్డలున్నారు. ఆమెకు భర్త తమ్మునితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి ఆమెను చాలాసార్లు హెచ్చరించాడు. శనివారం రాత్రి కూడా ఈ విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు.

ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఆరుబయట పడుకుని ఉన్న భార్యను అతను వేటకొడవలితో నరికి చంపాడు. ఆపై నేరుగా బర్గూరు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. తన తమ్ముడితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, అందుకే ఆమెను చంపేశానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఇన్‌స్పెక్టర్‌  సిబ్బందితో హత్యా స్థలానికి వెళ్లి  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం  కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి చనిపోయి, తండ్రి జైలు పాలు కావడంతో పిల్లలు బిక్కుబిక్కు మంటూ బేల చూపులు చూస్తూ ఏడుస్తున్నారు.

క్రైం: కోరికలే గుర్రాలైతే… | actioncutok.com