‘పెళ్ళి చూపులు’ బాట‌లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’!


కొత్త దర్శకుడితో విజయ్ దేవరకొండ చేసిన ‘పెళ్లి చూపులు’ జూలైలో వచ్చి హిట్టవగా, ఇప్పుడు మరో కొత్త దర్శకుడితో చేసిన ‘డియర్ కామ్రేడ్’ కూడా జూలైలోనే విడుదలవుతుండటం ఆసక్తికరం.

'పెళ్ళి చూపులు' బాట‌లో 'డియ‌ర్ కామ్రేడ్‌'!

‘పెళ్ళి చూపులు’ బాట‌లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’!

‘పెళ్ళి చూపులు’.. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఎంతో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. ఎందుకంటే.. ఈ సినిమాతోనే తొలిసారిగా సోలో హీరోగా అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడీ రౌడీ హీరో.  మూడేళ్ళ క్రితం అంటే 2016లో జూలై 29న ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రిలీజైంది. క‌ట్ చేస్తే..మ‌ళ్ళీ అదే నెల‌లో త‌న కొత్త చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’తో రాబోతున్నాడు విజ‌య్‌. స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో విజ‌య్ న‌టించిన ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అంతేకాదు.. ‘డియ‌ర్ కామ్రేడ్‌’కి, ‘పెళ్ళి చూపులు’కి మ‌రో విష‌యంలో కూడా క‌నెక్ష‌న్  ఉంది. అదేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా కొత్త ద‌ర్శ‌కులు తెర‌కెక్కించిన చిత్రాలే కావ‌డం. ‘పెళ్ళి చూపులు’ ద్వారా త‌రుణ్ భాస్క‌ర్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైతే.. ‘డియ‌ర్ కామ్రేడ్‌’ ద్వారా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు.

మ‌రి.. క‌లిసొచ్చిన నెల‌లో అది కూడా మ‌రోసారి కొత్త ద‌ర్శ‌కుడి కాంబినేష‌న్‌లో రానున్న విజ‌య్‌కి ఈ సారి కూడా మెమ‌ర‌బుల్ హిట్ ద‌క్కుతుందేమో చూద్దాం. ‘గీత గోవిందం’ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండకి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్న ఈ చిత్రం.. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో ఒకే రోజు రిలీజ్ కానుంది.

‘పెళ్ళి చూపులు’ బాట‌లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’! | actioncutok.com

Trending now: