డీఎస్పీ తగ్గించుకుంటున్నాడు!


డీఎస్పీ తగ్గించుకుంటున్నాడు!

డీఎస్పీ తగ్గించుకుంటున్నాడు!

టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్న దేవి శ్రీప్ర‌సాద్‌.. గ‌త కొంత‌కాలంగా త‌న స్థాయి బాణీలు ఇవ్వ‌ట్లేద‌న్న‌ది విమ‌ర్శ‌కుల మాట‌. ఇక తాజా చిత్రం ‘మ‌హ‌ర్షి’తో ఆ విమ‌ర్శ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చాడు డీఎస్పీ. ఏదేమైనా ‘మ‌హ‌ర్షి’కి వ‌చ్చిన నెగ‌టివ్ ఫీడ్ బ్యాక్‌కి రియ‌లైజ్ అయిన దేవి.. ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌.

గ‌త కొంత‌కాలంగా క్వాలిటీ కంటే క్వాంటిటీపైనే దృష్టి పెడుతున్న కార‌ణంగానే.. నాణ్య‌త లోపిస్తుంద‌ని భావించిన దేవి.. ఇప్పుడు సినిమాల సంఖ్య త‌గ్గించే ప‌నిలో ఉన్నాడ‌ట‌. అందుకే.. ఈ మ‌ధ్య చిరంజీవి -కొర‌టాల శివ కాంబినేష‌న్ మూవీ, మ‌హేశ్ బాబు – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌తో పాటు ‘వాల్మీకి’, ‘అఖిల్ 4’ చిత్రాల‌కి మ్యూజిక్ అందించేందుకు క‌మిట్ అయిన‌ డీఎస్పీ.. ‘మ‌హ‌ర్షి’కి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ దృష్ట్యా ‘వాల్మీకి’, ‘అఖిల్ 4’ నుంచి త‌ప్పుకున్నాడ‌ట‌.

అంతేకాదు.. చేతిలో ఉన్న చిరు, మ‌హేశ్ చిత్రాల‌కు మంచి అవుట్‌పుట్ ఇచ్చి..   “డీఎస్పీ ఈజ్ బ్యాక్” అనే దిశ‌గా త‌న ప‌నితనాన్ని చూప‌బోతున్నాడ‌ట ఈ రాక్ స్టార్‌. మ‌రి.. దేవి శ్రీప్రసాద్ వ్యూహం ఫ‌లిస్తుందేమో చూద్దాం.

డీఎస్పీ తగ్గించుకుంటున్నాడు! | actioncutok.com

More for you: