దిల్ రాజు నమ్మకాన్ని ‘మహర్షి’ డైరెక్టర్ నిలబెట్టుకుంటాడా?


దిల్ రాజు నమ్మకాన్ని 'మహర్షి' డైరెక్టర్ నిలబెట్టుకుంటాడా?
Vamshi Paidipally

దిల్ రాజు నమ్మకాన్ని ‘మహర్షి’ డైరెక్టర్ నిలబెట్టుకుంటాడా?

తొలి సినిమా ‘మున్నా’ బాక్సాఫీస్ వద్ద గొప్పగా ఆడకపోయినా ఆ సినిమాని రూపొందించిన విధానంతో చాలా మంది దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన ‘బృందావనం’తో తొలి హిట్ కొట్టాడు.

రాంచరణ్ హీరోగా రూపొందించిన తన మూడో సినిమా ‘ఎవడు’తో మరింత ఘన విజయం సాధించాడు. ఈ మూడు సినిమాల్నీ దిల్ రాజు నిర్మించడం గమనార్హం. అంటే వంశీకి కెరీర్‌ని ఇచ్చింది రాజు అనే చెప్పాలి.

తన నాలుగో సినిమా ‘ఊపిరి’ని పీవీపీ సినిమా బేనర్‌పై రూపొందించిన వంశీ.. ఆ సినిమాతో విమర్శకుల్ని అమితంగా ఆకట్టుకున్నాడు. ఫ్రెంచ్ ఫిల్మ్ ‘ఇన్‌టచబుల్స్’ను అతను రీమేక్ చేసిన విధానం అందరికీ నచ్చింది.

ఇప్పుడు తన ఐదో సినిమాలో మహేశ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్న వంశీ ‘మహర్షి’ని తీశాడు. సందర్భవశాత్తూ ఈ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించాడు. వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా నిర్మాణ భాగస్వాములైనా మేజర్ షేర్ రాజుదే.

అంటే వంశీ డైరెక్ట్ చేసిన 5 సినిమాల్లో నాలుగింటిని రాజు నిర్మించడం పెద్ద విశేషమే. ఈ రోజుల్లో ఒక దర్శకుడికి ఒక నిర్మాత ఇంతగా నమ్మి వరుసగా సినిమాలు నిర్మించడం చెప్పుకోదగ్గ అంశం. ఆ ఇద్దరి బంధానికి ఇది నిదర్శనం. తనను నమ్మిన నిర్మాతకు తన కెరీర్‌కే కాకుండా నిర్మాతగా రాజు కెరీర్‌కు కూడా బెస్ట్ మూవీని ఇవ్వాలనే తపనతో ‘మహర్షి’ని వంశీ రూపొందించాడని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మహేశ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మహర్షి’ మే 9న విడుదలవుతోంది. వాళ్లందరి కెరీర్లలోనూ ఈ సినిమా ద బెస్ట్‌గా నిలుస్తుందా?

దిల్ రాజు నమ్మకాన్ని ‘మహర్షి’ డైరెక్టర్ నిలబెట్టుకుంటాడా? | actioncutok.com

Trending now: