శవాన్ని చేసిన సెల్ఫీ సరదా!


శవాన్ని చేసిన  సెల్ఫీ సరదా!

శవాన్ని చేసిన సెల్ఫీ సరదా!

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మార్కండేయ బజారుకు చెందిన డాక్టర్ రమ్యకృష్ణకు నిరుడు  గోవాలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళింది. జగ్గయ్యపేట అర్బన్ హెల్త్ సెంటర్‌లో పని చేస్తున్న సమయంలో గోవాలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గోవాలోని ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో డాక్టర్‌గా పని చేస్తోంది.

సరదాగా స్నేహితులతో బీచ్‌కు వెళ్లిన డాక్టర్ రమ్య  సెల్ఫీ తీసుకునేందుకు కాస్త లోపలికి వెళ్లింది. అదే సమయంలో సముద్రపు అలలు బలంగా ఆమెను తాకడంతో ఆమె కొట్టుకుని పోయింది. ఈ ప్రమాదాన్ని  గమనించిన స్నేహితులు, పర్యాటకులు  ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు కానీ ఉధృతంగా వస్తున్న అలల ధాటికి ఆమె జాడ కనిపెట్టలేకపోయారు.

అతి కష్టంమీద గజ ఈతగాళ్లు ఆమె మృతదేహాన్ని గుర్తించ గలిగారు. రమ్య దుర్మరణం తెలిసి జగ్గయ్యపేట లోని ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

శవాన్ని చేసిన సెల్ఫీ సరదా! | actioncutok.com

More articles for you: