‘రూలర్’లో డబుల్ ట్విస్ట్!


'రూలర్'లో డబుల్ ట్విస్ట్!
Jagapathi Babu

‘రూలర్’లో డబుల్ ట్విస్ట్!

ఎలాంటి మాస్ చిత్రంలోనైనా.. హీరో క్యారెక్ట‌ర్ ఎలివేట్ అవ్వాలంటే ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ రోల్ ఉండాల్సిందే.  మాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన నంద‌మూరి బాల‌కృష్ణ .. ఈ ఫార్ములాను ప‌క్కాగా ఫాలో అవుతుంటాడు. ఇంకా చెప్పాలంటే.. ఒకటికి మించిన‌ ప్ర‌తినాయ‌కుల పాత్ర‌లు
బాల‌య్య సినిమాల్లో క‌నిపిస్తుంటాయి.

ఈ నేప‌థ్యంలో.. బాల‌య్య కొత్త చిత్రంలోనూ మల్టిపుల్ విల‌న్ రోల్స్ ఉంటాయ‌ట‌. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ ఒక‌టి ఫిల్మ్‌న‌గ‌ర్‌లో పుకార్ల రూపంలో షికారు కొడుతోంది. అదేమిటంటే.. ‘రూల‌ర్‌’ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో విల‌న్‌గా న‌టిస్తున్న జ‌గ‌ప‌తిబాబు డ‌బుల్ రోల్‌లో క‌నిపిస్తాడ‌ట‌. అలాగే.. జ‌గ్గూ భాయ్ చేస్తున్న ఆ రెండు పాత్ర‌లు కూడా చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటాయ‌ని స‌మాచారం.

ఇదివ‌ర‌కు.. ‘అశ్వ‌మేథం’ చిత్రంలో బాలీవుడ్ విల‌న్ అమ్రిష్ పురి డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. క‌ట్ చేస్తే.. ఇప్పుడ‌దే ఫార్ములాని బాల‌య్య కొత్త చిత్రానికి కూడా అప్ల‌య్ చేస్తున్నార‌న్న‌ మాట‌. 

‘రూలర్’లో డబుల్ ట్విస్ట్! | actioncutok.com

Trending now: