పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలి వేసింది!


పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలి వేసింది!

పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలి వేసింది!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు సీట్లలోనూ ఓడిపోవడంపై హీరో డాక్టర్ రాజశేఖర్ సానుభూతి ప్రకటించారు. ఆయన కనీసం ఒక్క సీట్లో అయినా గెలిచుంటే బావుండేదని అన్నారు. ఈ ఎన్నికల ముందు రాజశేఖర్, జీవిత దంపతులు వైఎస్సార్‌సీపీలో చేరి, ఆ పార్టీ తరపున కొన్ని చోట్ల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గాజువాకలో ప్రచారం చేశాననీ, పవన్ కల్యాణ్‌పై వ్యతిరేకతతో ఆ ప్రచారం చెయ్యలేదనీ రాజశేఖర్ చెప్పారు.

“నేను భీమవరం వెళ్లలేదు. గాజువాకకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది. నేను చేరిన వైఎస్సార్‌సీపీ తరపున ఎక్కడెక్కడికి వెళ్లి ప్రచారం చెయ్యాలో ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం వెళ్లానంతే. నాకు పవన్ కల్యాణ్‌పై వ్యతిరేకత ఏమీ లేదు. ఉండి ఉంటే ఆయన పార్టీ పెట్టిన ఈ ఐదేళ్లలో నేను మాట్లాడొచ్చు కదా. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు నన్నడిగి రచ్చ రచ్చ చేసినవాళ్లున్నారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పుడు నా అభిప్రాయం గురించి ఎంత మంది అడిగారో! అందరికీ నేను ‘నో కామెంట్’ అనే చెప్తూ వచ్చాను. ఈ ఎన్నికల వరకూ అదే పరిస్థితు ఉంటుందని అనుకున్నా. కానీ నా కర్మ ఇలాంటి పని చేపించింది. ఇది కావాలని ప్లాన్ చేసింది కాదు. ‘మా’ ఎన్నికలప్పుడు నాగబాబు మాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ‘ప్రజా రాజ్యం’ కాలంలో చిరంజీవి గారికీ, నాకూ మధ్య నెలకొన్న అపోహలు తొలగడానికే ఇన్ని రోజులు పట్టింది.

పవన్ కల్యాణ్ నా గురించి ఒక సినిమాలో అల్లరి చేయించడం ఎప్పుడో జరిగింది. నేను ఆయన గురించి ఏమైనా మాట్లాడాలంటే ఈ ఐదేళ్లలో మాట్లాడి ఉండొచ్చు. నేను ఇప్పుడు కేవలం మా పార్టీ కోసం వెళ్లాను, పార్టీ కోసం ప్రచారం చేశాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. పవన్ కల్యాణ్ ఈ మధ్య ఇచ్చిన ప్రకటన చూసి నాకు చాలా జాలివేసింది. ‘అయ్యో.. ఆయన ఓ సీటైనా గెలిచుంటే బావుండేదే’ అని. ఆయన భీమవరంలో గెలుస్తారని అనుకున్నా. గెలుపోటములు ఎవరి చేతుల్లోనూ లేవు” అని చెప్పుకొచ్చారు రాజశేఖర్.

పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలి వేసింది! | actioncutok.com

More for you: