క్రైం: తల్లిని చంపిన తనయుడు


క్రైం: తల్లిని చంపిన తనయుడు

క్రైం: తల్లిని చంపిన తనయుడు

నెల్లిమర్ల: కడుపులోకి దిగిన మద్యం కింద మానవత్వం, మమకారం సమాధి అయిపోయాయి. ఉన్మాదిలా మారిపోయాడు. తాగుడుకు డబ్బులు  ఇవ్వలేదని వెంటపడి మరీ ఇటుకరాయితో కొట్టి కన్నతల్లిని కడతేర్చాడు ఈ కసాయి కొడుకు. సోమవారం జరిగిన ఈ అమానుష సంఘటనకు  నెల్లిమర్ల నగర పంచాయతీ గ్రామం వేదికయింది.

స్థానిక నిక మండల పరిషత్‌ కార్యాలయం పక్కనే ఓ గుడిసెలో జలుమూరు గౌరమ్మ(65) అనే వృద్దురాలు  ఒంటరిగా ఉంటోంది. స్థానిక మిమ్స్‌ ఆసుపత్రి క్యాంటీన్‌లో పని చేకుంటూ కాలం వెళ్లదీస్తోంది.ఆమె రెండో కొడుకు శ్రీను రోజూ తాగొచ్చి డబ్బుల కోసం తల్లితో గొడవ పడేవాడు. 

సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వచ్చి  డబ్బులు కావాలని తల్లి గౌరమ్మను అడిగాడు. ఆమె లేవు పొమ్మన్నది. దీంతో డబ్బులు లేవంటావా అంటూ తల్లిని ఇష్టమొచ్చినట్లు కొట్టడం ప్రారంభించాడు. ఉన్మాదిలా మారిన కొడుకు నుంచి తప్పించుకుని అక్కడే ఉన్న పంప్ హౌస్‌ దగ్గరకు  పరుగులు తీసింది. గేటు వేసి ఉండడంతో పక్కకు తిరిగేసరికి శ్రీనుకు దొరికిపోయింది.

అతను విసిరిన  ఇటుకరాయి ఆమె తలకు బలంగా  తగలడంతో తీవ్రగాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనపై ఆమె  పెద్దకొడుకు పోతురాజు ఫిర్యాదు చేయగా పోలీసులు హుటహుటిన అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. గౌరమ్మ మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి శవపరీక్ష కోసం  తరలించారు. నిందితుడు శ్రీను పోలీసుల ఆదుపులో ఉన్నాడు.

క్రైం: తల్లిని చంపిన తనయుడు | actioncutok.com

Trending now: